close
Choose your channels

'భీమ్లా నాయ‌క్' నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘లాలా భీమ్లా’

Sunday, November 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భీమ్లా నాయ‌క్ నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘లాలా భీమ్లా’

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్‌ ఆదివారం మరో సాంగ్‌ను విడుదల చేసింది. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను స్టార్ డైరెకట్ర్ తివిక్రమ్ స్వయంగా రాశారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. పవన్ క్యారెక్టర్ అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట పవర్‌స్టార్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. "పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు...
పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు..." అంటూ త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించారు.

భీమ్లా నాయ‌క్ నుంచి టైటిట్ సాంగ్ విడుద‌ల‌.. ఫ్యాన్స్‌ని ఊపేస్తున్న ‘లాలా భీమ్లా’

ఇప్పటికే భీమ్లా టైటిల్ సాంగ్‌తో పాటు అంతా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై మరో పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కలిసి నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ .. దీనికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యువ నటుడు రానా కూడా నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.