సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'లంక'

  • IndiaGlitz, [Saturday,March 25 2017]

రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'లంక'. సీనియ‌ర్ హీరోయిన్ రాశి ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. రాశి, సాయిరోన‌క్‌, ఇన‌సాహా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా ప్ర‌చార చిత్రాన్ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌లు సి.ఎం.ప్ర‌వీణ్‌కుమార్‌, జ‌నార్ధ‌న్ రెడ్డి, సాయిర‌మేష్‌, భూష‌ణ్ విడుద‌ల చేశారు.

మైండ్ గేమ్‌ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా మూడు పాత్ర‌ల మ‌ధ్య సాగే చిత్ర‌మే లంక‌. ఈ సినిమాలో ఒక పాట మాత్ర‌మే ఉంటుంది. సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు ముని చెప్పారు. మంచి క‌థ అవ‌స‌రం. రాశికి ఈ సినిమాతో మంచి బ్రేక్ వ‌స్తుంద‌ని నిర్మాత‌లు తెలిపారు.క‌ళ్యాణ్ వైభోగ‌మే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాశికి ఈ లంక సినిమా మంచి బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నానని దామోద‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌త్యం రాజేష్‌. ముత్యాల రాందాస్‌, ర‌వికుమార్ త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

More News

చిరుతో అక్షయ్..?

ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ చిత్రం సక్సెస్తో గ్రాండ్ రీఎంట్రీ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

ఏంజెల్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్

యంగ్ హీరో నాగ అన్వేష్ బర్త్ డే సెలబ్రేషన్ నిన్న(మార్చి 24న) ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగాయి. ఈ వేడుకకు ఫిల్మ్ మీడియా ప్రతినిధులతో పాటు, ఏంజెల్ చిత్రం నిర్మాత భువన్ సాగర్, డైరెక్టర్ బాహుబలి పళని తదితరలు హాజరైయ్యారు.

'చెలియా' సెన్సార్ పూర్తి...ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం 'చెలియా'.

'బాబు బాగా బిజి' ధియోట్రికల్ ట్రైలర్ కి అనూహ్య మైన స్పందన

దాదాపు 90కి పైగా చిత్రాల్ని పంపిణీచేసి మెట్టమెదటిసారిగా ప్రోడక్షన్ ని ప్రారంభించిన శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా నిర్మాతగా, సెన్సిటివ్ పాయింట్స్ చిత్రాలతో దర్శకుడిగా, నటుడుగా పేరుతెచ్చుకున్నదర్శక నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా మంచి కమర్షియల్ కథతో నిర్మించిన చిత్రం బాబు బాగా బిజీ.

తమిళ రీమేక్ లో రవితేజ

గతేడాది సినిమాలే చేయని రవితేజ ఈ ఏడాది విక్రమ్ సిరి దర్శకత్వంలో ఒక సినిమా,అనిల్ రావిపూడి దర్శకత్వంలో