close
Choose your channels

విల‌న్‌గా మారుతున్న లారెన్స్‌..?

Tuesday, March 9, 2021 • తెలుగు Comments

విల‌న్‌గా మారుతున్న లారెన్స్‌..?

సైడ్ డాన్స‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌గా మారి అక్క‌డి నుంచి న‌టుడు.. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు, నిర్మాత ఇలా అన్నింట త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటూ వ‌చ్చిన రాఘ‌వ లారెన్స్ ఇప్పుడు కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అదే ప్ర‌తినాయ‌కుడిగా.. కోలీవుడ్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్ర‌మ్‌’. ఖైది, మాస్ట‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో ఎవ‌రిని న‌టింప చేస్తే బావుంటుందా? అని యూనిట్ ఆలోచించింది. లారెన్స్ అయితే బావుంటుంది. డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని భావించిన లోకేష్ క‌న‌క‌రాజ్ ఆయ‌న‌తో సంప్ర‌దింపులు చేస్తున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న 232వ చిత్ర‌మిది. ఇది వ‌ర‌కే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ఎన్నిక‌ల అనంత‌రం షూటింగ్ ప్రారంభం కానుంది. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్‌హాస‌న్‌, ఆర్‌.మ‌హేంద్ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz