'లాస్ట్ సీన్' చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,August 16 2018]

ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి పతాకంపై హర్ష కుమార్, తులికా సింగ్ హీరోహీరోయిన్లుగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో ‘లాస్ట్ సీన్’ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సల్మాన్ సర్కార్ క్లాప్ నివ్వగా, ప్రకాష్ ఠాకూర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. హైదరాబాద్‌లో ఆగస్ట్ 20 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బలదేవ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరి. ఇప్పటి వరకు ఎక్కడా చూడనిది. లాస్ట్ సీన్ కథ అద్భుతంగా కుదిరింది. హైదరాబాద్‌లో ఆగస్ట్ 20 నుంచి మూడు రోజుల పాటు షూటింగ్ జరుపుతాము. నెలాఖరు నుంచి 18 రోజుల పాటు కేరళలో జరిగే షూటింగ్‌తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. సంగీతానికి స్కోప్ ఉన్న చిత్రమిది. అందరికీ నచ్చేలా ఉంటుంది..’’ అన్నారు.

హర్షకుమార్, తులికాసింగ్, మధునారాయణ్, హిమాయత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, డైలాగ్స్: రమణ్ గోయల్, సంగీతం: అనిల్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొల్లా జగన్‌మోహన్ రావు, కాస్టింగ్ డిజైనర్: రీతా భవాలి, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: దీపక్ బలదేవ్, నిర్మాణం: గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి.

More News

స్మిత వెబ్ సిరీస్‌

90 ద‌శ‌కంలో కుర్ర‌కారును కైపు క‌ళ్ల‌తో మ‌త్తెక్కించిన న‌టి సిల్క్ స్మిత‌. ద‌క్షిణాదిన అగ్ర హీరోలంద‌రి చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌..

'గీత గోవిందం' కు మెగ‌స్టార్‌, సూప‌ర్‌స్టార్ ప్ర‌శంస‌...

మంచి చిత్రాల‌ను పెద్ద స్టార్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంసిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన గీత గోవిందంకు ఇండ‌స్ట్రీ నుండి ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

సమీరం ట్రైలర్ విడుదల

నూతన నిర్మాణ సంస్థ అనిత క్రేయేటివ్ వర్క్స్ బ్యానర్ లో అనిత దేవేందర్ రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న సినిమా సమీరం.

నాని హీరోయిన్ ఫిక్స్‌..

నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజ‌న్‌తో పాటు.. రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ 'దేవ‌దాస్‌' కాగా..

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌...

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మైంది. 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్ నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు ఇందుకూరి ఈ బ‌యోపిక్‌ను నిర్మించనున్నారు.