గ‌తేడాది సూర్య‌.. ఈ ఏడాది మ‌హేష్‌..

  • IndiaGlitz, [Monday,May 09 2016]

అందం ఉంది.. అభిన‌యం ఉంది.. అవ‌కాశాలూ ఉన్నాయి.. అయినా అంద‌ల‌మెక్క‌లేని ప‌రిస్థితి క‌న్న‌డ క‌స్తూరి ప్ర‌ణీత‌ది. చిన్న సినిమాతో తొలి అడుగులు వేసి.. పెద్ద హీరోల ప‌క్క‌న సెకండ్ లీడ్ చేసే స్థాయికి ఎదిగినా ఈ ముద్దుగుమ్మ‌కి ఆశించిన స్థాయి గుర్తింపు రావ‌డం లేద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. 'అత్తారింటికి దారేది' అనే ఒకే ఒక విజ‌యం మాత్ర‌మే త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌ణీత త‌న ఆశ‌ల‌న్నీ కొత్త చిత్రం 'బ్ర‌హ్మోత్స‌వం'పైనే పెట్టుకుంది.

ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప‌క్క‌న మూడో హీరోయిన్‌గా న‌టించింది. ఈ నెల 20న విడుద‌ల కానుందీ చిత్రం. విశేష‌మేమిటంటే.. గ‌తేడాది ఇదే మే నెల‌లో సూర్య వంటి అగ్ర క‌థానాయ‌కుడుతో ప్ర‌ణీత జోడీ క‌ట్టిన 'రాక్ష‌సుడు' అనే త‌మిళ అనువాద చిత్రం విడుద‌లైంది. క‌ట్ చేస్తే.. మ‌రో స్టార్ హీరోతో ఏడాది త‌రువాత అదే నెల‌లో తాజా చిత్రంతో ప‌ల‌క‌రించ‌నుంది ప్ర‌ణీత‌. మ‌రి గ‌తేడాది క‌లిసిరాని మే ఈ ఏడాది అయినా అమ్మ‌డికి క‌లిసొస్తుందా..?

More News

తండ్రీ కొడుకుల 'నాటుకోడి'

అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ కు,నిజాయతీగల కానిస్టేబుల్ కు మద్య జరిగే కథతో తెరకెక్కిన చిత్రం నాటుకోడి.

నాగార్జున 'సంతోషం'కి 14 ఏళ్లు

'ప్రేమించ‌డానికి రెండు మ‌నసులు చాలు.. కానీ పెళ్లి చేసుకోవ‌డానికి రెండు కుటుంబాలు కావాలి' అనే పాయింట్‌తో తెర‌కెక్కి కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన చిత్రం 'సంతోషం'. క‌థాబ‌లం ఉన్న ఈ చిత్రంతో కింగ్ నాగార్జున కెరీర్‌లో మ‌రో మంచి విజ‌యం న‌మోదైంది.

20లోకి 'ప్రేమించుకుందాం..రా!'

ప్రేమ‌క‌థా చిత్రాల్లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన‌ చిత్రం 'ప్రేమించుకుందాం..రా!'. తెలుగు తెర‌కు తొలిసారి ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ ని ప‌రిచ‌యం చేసింది ఈ సినిమానే. క‌థానాయ‌కుడు వెంక‌టేష్ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా నిలిచిందీ చిత్రం.

చిరు 'గ్యాంగ్‌లీడ‌ర్‌'కి 25 ఏళ్లు

'చెయ్యి చూడు.. ఎంత ర‌ఫ్ గా ఉందో.. ర‌ఫ్పాడిస్తా' అనే మేన‌రిజ‌మ్‌తో మెగాస్టార్ చిరంజీవి సంద‌డి చేసిన చిత్రం 'గ్యాంగ్‌లీడ‌ర్‌'. మాస్ ప్రేక్ష‌కులు మెచ్చే క‌థ‌తో, పాట‌ల‌తో రూపొందిన ఈ చిత్రం అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నంగా నిలిచింది.

'ఒక్క అమ్మాయి తప్ప' పాటలు విడుదల

ప్రస్థానం'వంటి డిఫరెంట్ మూవీతో సినిమా రంగానికి పరిచయమైన సందీప్ కిషన్ హీరో గా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'.