లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి 1.30 సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఆమె ఇబ్బందికి గురవడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం తెల్లవారుజామున ఆమె పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే ఐసీయూకి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం లతకు నుమోనియా సోకింది.

ఇదిలా ఉంటే ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబీకులు ఓ రకంగా.. వైద్యులు మరో రకంగా చెబుతున్నారు. లత ఆరోగ్యం కొంచెం కూడా మెరుగుపడలేదని వైద్యం అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ చెబుతున్నారు. అయితే లత కుటుంబీకులు మాత్రం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని చెబుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి క్లారిటీ లేకపోవడంతో ఆమె అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. మరి లత ఆరోగ్యంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

‘పవన్ నాలుగో భార్యను మరిచారు.. జగన్ సారీ చెప్పాలి’

ఇదేంటి పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ లెక్క ప్రకారం నాలుగో భార్య కూడా ఉందట. తనే స్వయంగా ఫేస్‌బుక్ వేదికగా కత్తి రాసుకొచ్చాడు.

'ఆధార్' అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారా!?

ఇప్పుడు సర్వం ఆధార్ కార్డే. ఏ చిన్న పని చేయాలన్నా మొదట అడిగేది ఆధార్ కార్డు ఉందా అనే మాటే వస్తుంది. అయితే ఏ చిన్న మిస్టేక్ ఉన్నా అంతే సంగతులు. ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవాలంటే కనీసం

మహా ‘పీఠం’ శివసేనదే.. ‘సీఎం’గా కూర్చునేదెవరో..!?

మహారాష్ట్ర సీఎం ‘పీఠం’పై చిక్కుముడులన్నీ వీడిపోయాయి. ఇప్పటి వరకూ బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని భావించినప్పటికీ.. చివరికి సీన్ రివర్స్ కావడంతో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి.

జగన్‌ వ్యాఖ్యలపై స్పందించకండి.. జనసేన నేతలకు పిలుపు!

‘సినిమా నటుడు పవన్ కల్యాణ్‌కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో.. ఎంత మంది పిల్లలో మరి. నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా?.

విజయ్‌చందర్‌కు వైఎస్ జగన్ కీలక పదవి

టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత తెలిదేవర విజయ్ చందర్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజయ్ చందర్‌ను