మ‌హేశ్ మూవీ పై విన‌ప‌డుతున్న వార్త‌లు

  • IndiaGlitz, [Tuesday,May 29 2018]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఈ జూన్ నుండి త‌న 25వ సినిమాతో బిజీ కాబోతున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే మ‌హేశ్ 25వ సినిమా ఫ‌స్ట్ లుక్, టైటిల్‌కు సంబంధించిన పోస్ట‌ర్ ఒక‌టి.

మ‌హేశ్ సీరియ‌స్ లుక్‌లో క‌న‌ప‌డుతున్నారు. దీనికి రాజసం అనే టైటిల్ పెట్టారు. మ‌రో విష‌య‌మేమంటే ఈ లుక్‌లో మ‌హేష్ గ‌డ్డం, కోర‌మీసంతో క‌న‌ప‌డుతుండ‌ట‌మే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. అల్ల‌రి న‌రేశ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు.