close
Choose your channels

నాగ్ ఊపిరి లేటెస్ట్ అప్ డేట్..

Tuesday, December 15, 2015 • తెలుగు Comments

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నాల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ  పి.వి.పి బ్యాన‌ర్  ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్నినిర్మిస్తుంది. ఈ చిత్రంలో అందాల తార అనుష్క గెస్ట్ రోల్ చేస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ ఈనెల 21 నుంచి వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో ప్ర‌ధాన తార‌గ‌ణం పై  కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్త‌వుతుంది. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని ఒకేసారి ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.