లావణ్య విత్ లవ్ బాయ్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ!

  • IndiaGlitz, [Saturday,May 06 2017]

సాంబ, యోధ, కిరణ్, పావని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్. డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకుడు. రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి, సి. నర్సింలుపటేల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను రాష్ట్ర ఆర్‌టిఐ ఛైర్మన్ విజయబాబు శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేయ రచయితగా మంచి పేరుతెచ్చుకున్న వడ్డేపల్లి కృష్ణ చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేసి ఆశ్చర్యాన్ని కలిగించారు. చిన్న సినిమా అయినా అందులో విషయం వుంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది. చిన్న చిత్రాల్ని బ్రతికించడానికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు మినీ థియేటర్‌లను నిర్మిస్తున్నాయి. వీటిని కూడా కొంత మంది కబ్జా చేయాలనే ఆలోచనలో వున్నారు అని తెలిపారు. దర్శకుడు డా. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ దర్శకుడిగా నా తొలి చిత్రం ఎక్కడికికెళ్తుందో మనసు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. నిర్మాత చిత్రాన్ని సరైన పద్దతిలో ప్రచారం చేయకపోవడం వల్లే ప్రేక్షకులకు చేరువకాలేదు. దాంతో కొంత కాలం దర్శకత్వం వైపు ఆలోచించలేదు. దాదాపు దశాబ్ద కాలం తరువాత నేను దర్శకత్వం వహించిన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నవరసాల్ని మిళితం చేసి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించాను.
ముగ్గురు యువకులు, ఓ యువతి నేపథ్యంలో సాగే చిత్రమిది. పడుచుకుర్రాళ్ల ప్రణయగాథగా తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణతో నలభైఏళ్ల అనుబంధం నాది. అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా తరువాత మళ్లీ వడ్డేపల్లి కృష్ణతో మరో చిత్రాన్ని ప్రారంభిస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో సాంబ, కిరణ్, పావని, మోగి, వైభవ్, బసిరెడ్డి, భిక్షమయ్య, కాశీవిశ్వనాథ్, హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

More News

అతనే నా చివరి దర్శకుడంటున్న హీరోయిన్...

బాలీవుడ్ లో క్వీన్,తను వెడ్స్ మను సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కంగనా రనౌత్

చైతు పాత్రలో జీవీ ప్రకాష్

తమిళ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా మరో సినిమా చేయడానికి జీవీ ప్రకాష్ సిద్ధమయయాడు. చైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 100%లవ్ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నారట.

ఆగస్ట్ 11న విడుదలవుతున్న 'ఓటర్'

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ "ఓటర్". "హీరో ఆఫ్ ది నేషన్" అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట (జాన్) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

'రక్షకభటుడు' అన్నీవర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - ఎ.గురురాజ్

నటుడుగా చిత్ర పరిశ్రమలో కెరీర్ ను ప్రారంభించిన గురురాజ్ పలు చిత్రాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించారు.

దిల్ రాజు, నేచురల్ స్టార్ నాని, శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో కొత్త చిత్రం 'ఎంసిఎ' ప్రారంభం

డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని హీరో,హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో