శరవేగంగా లావణ్య విత్ లవ్ బాయ్స్

  • IndiaGlitz, [Saturday,March 18 2017]

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్. డా. పరుచూరి గోపాలకృష్ణ, కాశీవిశ్వనాథ్, హేమసుందర్, పావని, స్వరూప, యోధా, సాంబ, కిరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్నారు. ఇటీవల పతాక సన్నివేశాలు పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే అందమైన చిత్రమిది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. చక్కటి కథా, కథనాలతో పాటు మాటలు, పాటలు అన్ని అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తున్నాడు. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పతాక సన్నివేశాలు చిత్రీకరించాం. అని తెలిపారు. కాశీవిశ్వనాథ్, పరుచూరి గోపాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నర్సింహులు పటేల్‌చెట్టి.

More News

పాండిచ్చేరిలో 'రాజుగారిగది 2'

'ఓం నమో వేంకటేశాయ' సినిమా తర్వాత అక్కినేని నాగార్జున హర్రర్ థ్రిల్లర్ 'రాజుగారి గది 2'

'ఖయ్యుంభాయ్' కు గుమ్మడికాయ కొట్టేస్తున్నారు

గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖయ్యుం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు.

అంజలి పొమ్మంది...క్యాథిరిన్ వచ్చింది...

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్లోద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఎప్పుడంటే...

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 2.0

యు.ఎస్ కంపెనీ ట్రాంపోలైన్ పార్క్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ను ఇండియన్ క్రికెట్ లీగ్ తరపున క్రికెట్ ఆడటాన్ని చూసే ఉంటాం.