బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు. బీరుట్‌ను వణికించిన పేలుళ్లకు అమ్మోనియం నైట్రరేట్ కారణమని అధికారులు ప్రకటించారు. బీరుట్ పోర్టుకు సమీపంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఈ పేలుళ్లు సంభవించిన అధికారులు వెల్లడించారు. దీనిపై లెబనాని ప్రధాని హసాన్ దియాబ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద మొత్తంలో రసాయనాలను నిల్వ ఉంచడం బాధ్యతా రాహిత్యమన్నారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని.. కారకులెవరైనా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

కాగా.. బీరుట్‌‌లో మంగళవారం సంభవించిన పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణకు పుట్టించాయి. బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 78 మంది మృతి చెందగా.. దాదాపు 4 వేల మంది గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. బీరుట్ పోర్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. పెద్దమొత్తంలో ఆస్తినష్టం సంభవించింది.

More News

ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

వినాయకచవితి వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపూ ఖైరతాబాద్ వినాయకుని వైపే ఉంటుంది.

అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసిన మోదీ..

యావత్ భారతావనికి ఉత్కంఠ భరితమైన క్షణాలివి.. శ్రీరామ నామ జపంతో దేశ మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

అయోధ్యలో భూమిపూజ.. రావణుడు పుట్టిన బిస్రాఖ్‌లో సైతం సంబరాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్..

ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో

ఆర్జీవీ బాట‌లో ఆయ‌న శిష్యుడు!!

ద‌ర్శ‌క నిర్మాత‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ వూర‌ఫ్ ఆర్జీవీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.