Balakrishna: బాలయ్య మాటలు తప్పుగా అనిపించలేదు.. విషయాన్ని సాగదీయొద్దు : ఎస్వీఆర్ వారసుల విజ్ఞప్తి


Send us your feedback to audioarticles@vaarta.com


‘‘వీరసింహారెడ్డి’’ సక్సెస్ మీట్లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మహానటులు ఎస్వీఆర్, ఏఎన్ఆర్లను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వారి ఫ్యాన్స్‌తో పాటు కొన్ని సామాజిక వర్గాలు సైతం భగ్గుమంటున్నాయి. బాలయ్య బేషరతుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో భారీగా నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి అక్కినేని ఫ్యాన్స్ బాలయ్య దిష్టి బొమ్మలను దగ్థం చేశారు. అటు ఏఎన్ఆర్ మనవళ్లు కూడా బాలయ్యకు సున్నితంగా చీవాట్లు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఎస్వీఆర్ వారసులు కూడా వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు, ఎస్విఎల్ఎస్ రంగారావులు బుధవారం వీడియో బైట్ రిలీజ్ చేశారు. అందులో వారు ఏమన్నారంటే.. ‘‘ బాలయ్య మాట్లాడిన కొన్ని విషయాలపై సోషల్ మీడియా, మీడియాలో విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా.. తమకు , బాలకృష్ణకు మంచి అనుబంధం వుంది. మేమంతా ఒక కుటుంబంగా వుంటాం. తోటి నటుడితో జరిగిన ఓ సంభాషణ గురించి బాలయ్య సాధారణ పోకడలో చెప్పారని, ఇందులో ఎస్వీఆర్ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగదీయవద్దు, మాకు , నందమూరి కుటుంబానికి వున్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.
వివాదానికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్న అభిమానులు :
మరోవైపు టాలీవుడ్‌లోని రెండు పెద్ద కుటుంబాల మధ్య వచ్చిన ఈ వివాదం త్వరగా సమసిపోవాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. దీనిని ఇంకా పెద్దది చేయడం వల్ల చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బ తింటుందని పలువురు అంటున్నారు. వివాదం మొదలైంది బాలయ్య వైపు నుంచి కాబట్టి.. ఇటీవల ఓ సామాజిక వర్గం విషయంలో ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పినట్లుగానే, నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తులైన అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారని పరిశ్రమ పెద్దలు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.