లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు

గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు. కోట్లాది హృదయాల్లో చిచ్చు పెట్టే ఈ వార్తను బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. మధ్యాహ్నం 1.04 గం.కు స్వర్గస్తులైనట్లు చరణ్ మీడియా ఎదుట ప్రకటించారు. నాన్న గారు కోలుకోవాలని ప్రార్థనలు చేసిన కోట్లాదిమంది అభిమానులకు ధన్యవాదాలు చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తతో దేశం మొత్తం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆగస్ట్ 5న ఎస్పీ బాలు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అప్పటి నుంచి ఆయనను ఐసీయూలో ఎక్మో సాయంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయనకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి బాలు క్రమక్రమంగా కోలుకుంటూ వస్తున్నారు.

అంతా బాగానే ఉంది త్వరలో బాలు డిశ్చార్జ్ అవుతారని ఆయన అభిమానులంతా భావిస్తున్న సమయంలో హఠాత్తుగా మరో న్యూస్. బాలు ఆరోగ్యం మరింత క్షీణించిందని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు గురువారం సాయంత్రం వెల్లడించాయి. నేడు ఆయన పరమపదించారని ఆయన కుమారుడు చరణ్ వెల్లడించడంతో కోట్లాది హృదయాలు బాధతో తల్లడిల్లిపోతున్నాయి. 

More News

మా అమ్మా నాన్న సహా అంతా జైలుకెళ్తారు: పరువు హత్యపై అవంతి

హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చందానగర్‌కు చెందిన హేమంత్.. అవంతి అనే యువతిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.

హైదరాబాద్‌లో మరో పరువు హత్య

మిర్యాలగూడ పరువు హత్య మరువక ముందే.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య జరిగింది. చందానగర్‌కు చెందిన హేమంత్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.

నేడు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకానున్న రకుల్

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక్క బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో స్టార్ హీరోయిన్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 4: అభికి దూరమవుతున్న మోనాల్.. దగ్గరవుతున్న హారిక

మైండ్ బ్లాక్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రోబోల చార్జింగ్ అయిపోవడంతో చిన్నగా అవినాష్ వచ్చి అమ్మ రాజశేఖర్ పక్కన కూర్చొని స్మార్ట్‌గా చార్జింగ్ పెట్టుకున్నాడు.

రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం

రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 180 రోజుల క్రితం సిటీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.