అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం: మంత్రి ఎస్.సవిత


Send us your feedback to audioarticles@vaarta.com


తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అమరజీవి జయంతి సందర్భంగా ఆదివారం ఆయన చిత్రపటానికి ఆమె పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. పొట్టి శ్రీరాముల వంటి నాయకులు 10 మంది ఉంటే ఏడాదిలోనే భారతదేశానికి స్వాతంత్ర్య తీసుకురావొచ్చిన అప్పట్లో మహాత్ముడు కొనియాడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
తెలుగు ప్రజలు ఆత్మ గౌరవంతో బతకాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించిన పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు అమరణదీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన ఆత్మ బలిదానంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిందన్నారు. పొట్టి శ్రీరాములు హరిజనోద్ధరణకు కూడా ఎంతో కృషిచేశారన్నారు. ఆనాడు దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశకల్పించాలని పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు జీవించే ఉంటారన్నారు.
అమరజీవి పోరాటం, ప్రాణార్పణం గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు మంత్రి. పొట్టి శ్రీరాముల పట్టుదల, అంకుఠిత దీక్ష నేటి యువతకు ఎంతో అవసరమన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరమూ కృషి చేద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments