వేసవి నీటి ఎద్దడి సవాళ్లను అధిగమిద్దాం: పవన్ కళ్యాణ్


Send us your feedback to audioarticles@vaarta.com


గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో ఎదురయ్యే తాగు నీటి సరఫరా సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి స్థాయి సంసిద్ధతతో ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
నీటి సంరక్షణ పట్ల ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని చెప్పారు. తాగు నీటి సరఫరాపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక వాటర్ వార్ రూమ్ లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోజువారీ నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడిపై మంగళగిరిలో ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
"ఒక్క చుక్క వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వర్షపు నీటి సేకరణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఇంటింటికీ, కమ్యూనిటి భవనాలకు వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి. తాగు నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం నీటి నిల్వను పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి గ్రామంలో ఫిల్టర్ బెడ్లను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేసి శుద్ధమైన నీటిని ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలి." అన్నారు.
ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించాలన్నారు పవన్ కల్యాణ్. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించాలని సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com