close
Choose your channels

లైగర్ గ్లింప్స్ టాక్: చాయ్‌వాలా బాక్సర్ ఎలా అయ్యాడు.. చావగొట్టాడంతే..!!

Friday, December 31, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లైగర్ గ్లింప్స్ టాక్: చాయ్‌వాలా బాక్సర్ ఎలా అయ్యాడు.. చావగొట్టాడంతే..!!

‘‘అర్జున్‌రెడ్డి’’, ‘గీతా గోవిందం’, ‘‘ట్యాక్సీవాలా’’ వంటి వరుస హిట్‌లతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘‘లైగర్’’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ‘‘లైగర్’’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ , లాక్‌డౌన్‌ల కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే అప్పుడెప్పుడో ఫస్ట్‌లుక్, మైక్ టైసన్‌తో ఫోటోలు రిలీజ్ చేయకపోవడంతో రౌడీ హీరో అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

లైగర్ గ్లింప్స్ టాక్: చాయ్‌వాలా బాక్సర్ ఎలా అయ్యాడు.. చావగొట్టాడంతే..!!

దీంతో కొద్దిరోజుల క్రితం లైగర్ టీం డబుల్ ధమాకాగా రెండు అప్ డేట్స్ ఇచ్చింది. ఒకటి ‘లైగర్’ సినిమా రిలీజ్ డేట్.. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేస్తామని ప్రకటించేశారు. ఇక రెండో అప్ డేట్ విషయానికి వస్తే.. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం.. ఈ రోజు గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

లైగర్ గ్లింప్స్ టాక్: చాయ్‌వాలా బాక్సర్ ఎలా అయ్యాడు.. చావగొట్టాడంతే..!!

‘లేడీస్ అండ్‌ జెంటిల్మెన్ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. MMA World ChampionsShip పోటీలు ప్రారంభమయ్యాయి. ముంబయి వీధుల్లో పెరిగిన స్లమ్‌డాగ్‌, చాయ్‌ వాలా.. ది లైగర్‌’’ అంటూ విజయ్‌ దేవరకొండని బాక్సింగ్ రింగ్ వద్ద పరిచయం చేసే సన్నివేశాలతో గ్లింప్స్ ప్రారంభమైంది. ముంబైలోని ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముతూ జీవనం సాగించే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడనేదే ఈ సినిమా కథలా తెలుస్తోంది. ఇప్పటి వరకు చాక్లెట్ బాయ్‌లా వున్న విజయ్‌ని ఊర మాస్ లెవల్లో చూపించారు పూరీ జగన్నాథ్. ‘వి ఆర్‌ ఇండియన్స్‌’ అంటూ విజయ్‌ చెప్పే డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన నటన మెప్పించేలా ఉంది. మరి లైగర్ పంచ్ పవర్ చూడాలంటే ఆగస్టు 25 వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.