శివ జొన్నల గడ్డ హీరోగా లైం లైట్‌ ప్రొడక్షన్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,June 08 2018]

శివ జొన్నలగడ్డ హీరోగా లైం లైట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి వసుంధర సమర్పణలో ప్రొడక్షన్‌ నెం-1 గా ఓ చిత్రం రూపొందుతుంది . టీ. రమేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా సురేష్‌ రెడ్డి అక్కల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సభ, లిఖిద హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు ఫిలించాంబర్‌లో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూబ్లిహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా ‘పోలీస్‌ పవర్‌’ నిర్మాత గుద్దేటి బసవప్ప కెమెరా స్విచాన్‌ చేశారు. ప్రసన్నకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ... ‘‘నా చిత్రాల కు దర్శకత్వశాఖలో పని చేసిన నా శిష్య బృందం అంతా కలిసి నాతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో నటిస్తున్నా. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునే విధంగా ఉంటాయని’’ అన్నారు.

దర్శకుడు సురేష్‌ రెడ్డి అక్కల మాట్లాడుతూ... ‘‘డైరక్టర్‌గా నా తొలి సినిమా ఇది. క్రైమ్‌, లవ్‌, రొమాన్స్‌ తో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఈ నెల రెండో వారం లో షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో , సెకండ్ షెడ్యూల్ బెంగళూరు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ... ‘‘జొన్నల గడ్డ శివ వరుసగా సినిమాలు తీస్తూ...తన చిత్రా ద్వారా ఎంతో మంది నూతన కళాకారుల ను పరిచయం చేస్తున్నాడు. తన శిష్య బృందం అంతా కలిసి చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాని’’ అన్నారు.

‘పోలీస్‌ పవర్‌’ నిర్మాత గుద్దేటి బసవప్ప మాట్లాడుతూ... ‘‘జొన్నలగడ్డ శివ వరుస చిత్రాలతో ముందుకెళ్తున్నాడు. తన శిష్య బృందం నిర్మి స్తోన్న ఈ చిత్రం విజయవంతం కావాలని’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు శివరాం, హీరోయిన్స్‌ లిఖిద, సభ పాల్గొని అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.

శివరాం, చేతన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: అనిల్‌కుమార్‌, సంగీతం:సాయి, ఎడిటర్‌: అనిల్‌ సందేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సతీష్‌ మట్టా, ప్రొడ్యూసర్‌: టి.రమేష్‌, డైరక్టర్‌: సురేష్‌ రెడ్డి అక్కల.

More News

7 రోజుల్లోనే 12 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిన 'అభిమన్యుడు' - నిర్మాత గుజ్జలపూడి హరి

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బేనస్స్‌పై

ప్రతిక్షణం థ్రిల్ చేసే వైఫ్ ఆఫ్ రామ్ - మంచు లక్ష్మి

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ యెలకంటి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మంచు మోహన్ బాబుతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు

డిసెంబ‌ర్ నుంచి మ‌హేష్‌, సుకుమార్ చిత్రం?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన '1 నేనొక్క‌డినే' కొత్త త‌ర‌హా చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

పంజాబీ చిత్రంలో కాజ‌ల్‌?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప‌దేళ్ళ‌కు పైగా క‌థానాయిక‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టికీ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది.

నాని, త్రివిక్ర‌మ్ చిత్రం అప్పుడేనా?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది.