రాంచరణ్, శంకర్ సినిమాకు లైన్ క్లియర్.. హైకోర్టు నుంచి బిగ్ రిలీఫ్

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అనేక చిక్కులు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కు అడుగడుగునా అడ్డంకులే తగులుతున్నాయి. నిర్మాతలతో వివాదం కారణంగా శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని పక్కన పెట్టేశారు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా శంకర్ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఫినిష్ కాగానే ఈ క్రేజీ కాంబోలో చిత్రం మొదలవుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇండియన్ 2 చిత్ర నిర్మాతలు లైకా సంస్థ శంకర్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: బ్రేకింగ్: విడిపోయిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు.. షాక్ లో బాలీవుడ్

తమ ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్ మరో చిత్రం చేయకుండా అడ్డుకోవాలని లైకా సంస్థ కోర్టుని కోరింది. దీనితో శంకర్, రాంచరణ్ సినిమా ఆలస్యం కాక తప్పదు అనే ఊహాగానాలు వినిపించాయి. లైకా నిర్మాతలు కోర్టుకి వెళ్లడంతో శంకర్ ఇండియన్ 2 చిత్రం పూర్తి చేయవలసిందే అని అంతా భావించారు.

కానీ తాజాగా మద్రాసు హైకోర్టులో శంకర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. శంకర్ మరో సినిమా చేయకుండా అడ్డుకోవాలని లైకా సంస్థ వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టేసింది. అలా అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. కోర్టు ప్రకటనతో శంకర్, రాంచరణ్ ల చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లు అయింది.

కోర్టు తాజాప్రకటనతో చరణ్,శంకర్ సినిమా ప్రారంభం గురించి కూడా ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ చిత్రం సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

More News

బ్యూటిఫుల్ పిక్స్: యష్, రాధికా దంపతుల కొత్త ఇంటి గృహ ప్రవేశం !

కెజిఎఫ్ సక్సెస్ తో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. తాజాగా యష్, రాధికా పండిట్ దంపతులు జీవితంలో సంతోషకరమైన కొత్త అడుగు వేశారు.

బ్రేకింగ్: విడిపోయిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు.. షాక్ లో బాలీవుడ్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది.

వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయా అంటే అవుననే ప్రచారం ఎక్కువవుతోంది.

ఇన్స్టాలో రిచ్ వీరే: ప్రియాంకని బీట్ చేసిన కోహ్లీ.. ఒక్కో పోస్ట్ కి అన్ని కోట్లా!

ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియా పవర్ ఫుల్ మీడియంగా మారిపోయింది. సాధారణ మీడియా కంటే జనాలు ఎక్కువగా సోషల్ మీడియానే ఇష్టపడుతున్నారు.

కరోనా రావడంలో తప్పు లేదు.. దిశా, అలియాతో గొంతు కలిపిన రష్మీ

సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలతో మనుషుల్లో మానవత్వం అంతరించి పోతోందా అనే అనుమానం కలగక మానదు.