తెలంగాణలో అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు : కేసీఆర్

తెలంగాణలోని మందుబాబులకు సీఎం కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. రేపట్నుంచే అనగా బుధవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరుస్తున్నట్లు మీడియా ముఖంగా కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలో కూడా మద్యం షాపులకు తెరుచుకునేందుకు ఆయన అనుమతిచ్చారు. అయితే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని ఈ సందర్భంగా.. ‘నో మాస్క్ నో లిక్కర్’ అనే స్లోగన్‌ను కేసీఆర్ చెప్పుకొచ్చారు. కంటైన్మెంట్ జోన్లలో 15 మంది షాపులున్నాయని అక్కడ మాత్రం తెరవరన్నారు. అయితే బార్లు, క్లబ్స్, పబ్స్ తెరవాడానికి మాత్రం అస్సలు చాన్సే లేదని సీఎం తేల్చిచెప్పారు. మద్యం ధరలు 16 శాతం పెంచుతున్నామని తెలిపారు. తక్కువ రేట్లు ఉన్న లిక్కర్‌ అనగా పేదలు తాగే మందుపై 11 శాతం.. మిగిలినవాటిపై అంటే పెద్దల తాగే లిక్కర్స్‌పై మాత్రం 16 మాత్రం పెంచుతున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో పెంచిన 70, 75 శాతంలపై ఇవాళ కేబినెట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని.. మాడరేట్‌గా మాత్రమే రాష్ట్రంలో పెంచుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వైన్స్ అమ్మే, కొనే వారికి సీఎం కొన్ని హెచ్చరికలు జారీ చేశారు.

నో మాస్క్ నో లిక్కర్..

ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరుచుకుంటాయి. వైన్స్ షాపుల్లో మద్యం అమ్మే.. కొనేవారని హెచ్చరిస్తున్నా. కచ్చితంగా భౌతిక దూరం పాటించి తీరాల్సిందే. ఎక్కడైనా బౌతికదూరం పాటించకపోతే మాత్రం కచ్చితంగా ఆ షాపుకు సంబంధించి లైసెన్స్ గంటలోనే రద్దు చేసేస్తాం. షాపులు తెరిచే ఉంటాయ్.. ఎవరూ ఆగమాగమం కావాల్సిన అక్కర్లేదు. డేంజరస్ బీమారి కాబట్టి షాపు ఓనర్లు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే. నో మాస్క్ నో లిక్కర్ అనే స్లోగన్ తీసుకొస్తున్నాం. అలాగే నో మాస్క్ నో గూడ్స్.. అంటే కిరాణా షాపుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇందుకే తెరుస్తున్నాం..

‘తెలంగాణలోని కొందరు మందుబాబులు, బార్డర్ గ్రామాల ప్రజలు మన పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు బార్డర్ రాష్ట్రాలకు వెళ్లి మందుకోసం క్యూ కడుతున్నారు. అలా వెళ్లడంతో కరోనా మహమ్మారి మరింత విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు గుడుంబా కూడా పెద్దఎత్తున ప్రారంభమైంది. దీంతో డిస్టలరీస్ కంపెనీలు తెరవాలని డిమాండ్ చేస్తున్నాయి. అందుకే మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతిస్తున్నాను’ అని సీఎం తెలిపారు.

More News

పదో తరగతి పరీక్షలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ..

గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోనళపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

కరోనాతో కలిసి బతకాల్సిందే..: కేసీఆర్

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌తో మనం కలిసి బతకాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో

నటుడు శివాజీరాజాకు హార్ట్ ఎటాక్

టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. బీపీ డౌన్ అవ్వడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నాం : కేసీఆర్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు

ప‌వ‌న్‌తో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుకుంటున్న బాపు బొమ్మ‌

క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని త‌యారు చేసి స్వ‌యంగా ఆమె పేద‌వారికి పంచుతుండ‌టం విశేషం.