మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

  • IndiaGlitz, [Tuesday,May 11 2021]

లాక్‌డౌన్ ప్రకటన వచ్చిందో లేదో మందుబాబులు పెద్ద ఎత్తున వైన్ షాపులకు క్యూ కట్టారు. అయితే వీరికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పటి లాగానే మందు అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్డౌన్ కాలంలో వైన్స్‌ షాపులను సైతం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా మద్యం దుకాణాలను తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు.

More News

ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ అంటే ఎలా?: హైకోర్టు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేటి మధ్యాహ్నం తిరిగి విచారణ ప్రారంభమైంది.

రేపటి నుంచి తెలంగాణలో లాక్‌డౌన్

లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది.

మంచు లక్ష్మికి షాక్ ఇచ్చిన హ్యాకర్స్

మంచు లక్ష్మి.. స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయిన నటి. ఆమెపై వచ్చినన్ని ట్రోల్స్ మరే నటిపై కూడా రాలేదనే చెప్పాలి.

డబుల్ మాస్క్ వాడుతున్నవారు.. ఈ విషయం తెలుసుకోవల్సిందే..

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ తరుణంలో మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, సోషల్ డిస్టెన్స్ పాటించడమనేది మానిడేటరీ అయిపోయింది.

ఇది మానవత్వమేనా?.. ధిక్కరణ నోటీసులిస్తాం: తెలంగాణ హైకోర్టు వార్నింగ్

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పరిస్థితి దారుణంగా తయారవుతోంది.