అయోధ్య తీర్పుపై లైవ్ అప్ డేట్స్

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

అయోధ్య తీర్పుపై లైవ్ అప్ డేట్స్ 10.30 ని. ల నుండి...

  • ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానాలతో యూపీ-నేపాల్‌ సరిహద్దు మూసివేత తీర్పు తర్వాత ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ హెచ్చరిక రాజస్థాన్‌లోని ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ [ 9:40 am ]
  • మధ్యాహ్నం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ ప్రెస్‌మీట్‌ అందరూ శాంతియుతంగా ఉండాలని ఇప్పటికే పిలుపునిచ్చిన భగవత్‌ [ 9:43 am ]
  • అయోధ్య తీర్పును వెలువరించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే... జస్టిస్‌ ధనుంజయ్‌, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ [ 9:48 am ]
  • మరికాసేపట్లో అయోధ్య కేసు తుది తీర్పు సుప్రీం కోర్టుకు చేరుకున్న చీఫ్ జస్టిస్ గొగోయ్ చీఫ్ జస్టిస్‌తో పాటు కోర్టుకు చేరుకున్న నలుగురు జడ్జీలు కోర్టులోపలికి పిటిషనర్లకు మాత్రమే అనుమతి [ 9:52 am ]
  • అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలో పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు బంద్ దేశ వ్యాప్తంగా హై అలర్ట్ దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ చేయాలని అధికారులకు కేంద్రం ఆదేశాలు [ 10:02 am ]
  • అయోధ్య తీర్పు నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద మూడంచెల భద్రత ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వారిని కూడా అనుమతించని పోలీసులు ఉద్యోగాలకు, కాలేజ్, స్కూల్స్ కు వెళ్లే వారికి తప్పని కష్టాలు [ 10:05 am ]
  • దశాబ్దాల తీర్పు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను- బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును అందరం గౌరవిద్దాం హిందు సోదరులంత సంమయనం పాటించాలని కోరుతున్నాను కొన్ని దుష్ట శక్తులు మనల్ని రెచ్చ గొట్టే ప్రయత్నం చేసినా.. పట్టింకోవద్దు తీర్పు ఎవరకి అనుకూలంగా వచ్చిన అందరూ కట్టుబడి ఉండాలి ఒకరి గెలుపు.. మరొకరి ఓటమి కాదు.. దేశం యొక్క గెలుపుగా భావిద్దాం భారతదేశంపై పాకిస్థాన్ పెద్ద కుట్ర చేస్తోంది [ 10:09 am ]
  • సుప్రీంతీర్పుపై సంబరాలు వద్దు- శ్రీశ్రీ రవిశంకర్ శాంతి, సంయమనం పాటించాలి [ 10:12 am ]
  • భద్రతా వలయంలో అయోధ్య అయోధ్య ఆలయం వద్దకు యాత్రికులకు అనుమతి నిరాకరణ 60 కంపెనీల పీఏసీ, పారామిలటరీ బలగాల మోహరింపు డ్రోన్‌, సీసీ టీవీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ అయోధ్యలో హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు సిద్ధం సభలు, ర్యాలీలు, విజయోత్సవాలకు అనుమతి నిరాకరణ రెచ్చగొట్టే ప్రకటనలు, హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు [ 10:20 am ]
  • ఢిల్లీ: సుప్రీంకోర్టు హాల్‌ నెం-1కు చేరుకున్న జడ్జిమెంట్‌ కాపీ న్యాయవాదులతో నిండిపోయిన కోర్టు హాల్‌ సుప్రీంకోర్టు హాల్‌-1లో తీర్పు వెల్లడించనున్న ధర్మాసనం సుప్రీంకోర్టుకు చేరుకున్న న్యాయమూర్తులు అయోధ్య తీర్పు చదువుతున్న చీఫ్‌ జస్టిస్‌ ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని జస్టిస్‌ గొగోయ్‌ విజ్ఞప్తి [ 10:32 am ]
  • జడ్జిమెంట్‌పై సంతకాలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ [ 10:33 am ]
  • యునానిమస్‌ జడ్జిమెంట్‌ ఇచ్చిన ఐదుగురు న్యాయమూర్తులు షియా వక్ఫ్‌బోర్డ్‌ వాదనలు తోసిపుచ్చిన న్యాయస్థానం యాజమాన్య హక్కులు కోరుతూ .. షియావక్ఫ్‌ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత తీర్పుపై ఐదు జడ్జీల ఏకాభిప్రాయం షియా బోర్డు పిటిషన్ కొట్టివేత తీర్పు చదివేందుకు అరగంట సమయం వివాదాస్పద భూమి తమదేనంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలు పరిగణనలోకి లోబడి తీర్పు గొగోయ్ వ్యాఖ్యలు:- రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలి: సీజేఐ బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదు: సీజేఐ విగ్రహాలు మాత్రం 1949లో ఏర్పాటు చేశారు: సీజేఐ మతపరమైన అంశాల్లో కోర్టు జోక్యం సహేతుకం కాదు: సీజేఐ తీర్పు చదవడానికి మరో అరగంట సమయం పడుతుంది: సీజేఐ [ 10:46 am ]
  • అయోధ్యపై సుప్రీంతీర్పు ఏకగ్రీవమే!? సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య తీర్పును.. ఏకగ్రీవంగా ఆమోదించినట్టు సమాచారం. [ 10:50 am ]
  • మసీద్‌ కింద ఆలయ అవశేషాలు ఉన్నట్లు ఏఎస్‌ఐ గుర్తించింది: సీజేఐ రామాలయం ఉన్నట్లు పరోక్షంగా ధృవీకరించిన కోర్టు నిర్మొహి అకాడ వాదనను తోసిపుచ్చిన కోర్టు సున్నీ వక్ఫ్‌బోర్డు తరచూ మాటమార్చిందన్న సీజేఐ అంతర్గతంగా ఉన్న నిర్మాణం ఇస్లామిక్‌ శైలిలో లేదు: సీజేఐ నిర్మొహి అఖాడ వాదనను తోసిపుచ్చిన కోర్టు సున్నీ వక్ఫ్‌బోర్డు తరచూ మాటమార్చిందన్న సీజేఐ అంతర్గతంగా ఉన్న నిర్మాణం ఇస్లామిక్‌ శైలిలో లేదు: సీజేఐ అయోధ్య రామజన్మభూమి అనేది హిందువుల నమ్మకం: సీజేఐ మసీదు కింద పురాతన కట్టడం ఆనవాళ్లు ఉన్నాయన్న.. ఏఎస్‌ఐ వాదనను తోసిపుచ్చలేం: సీజేఐ షియా బోర్డు వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు నిర్మొహి అఖాడ వాదనను కూడా పక్కన పెట్టిన సుప్రీం [ 10:52 am ]
  • అయోధ్యపై సుప్రీం కోర్టు తుదితీర్పు {లైవ్ అప్డేట్స్} బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదు బాబ్రీ మసీదు కింద భారీ నిర్మాణం ఉంది అయితే అది దేవాలయం అని చెప్పడానికి ఆధారాల్లేవ్ దేవాలయాన్ని ధ్వంసం చేశారనడానికి పురావస్తు ఆధారాల్లేవ్ 12-16 శతాబ్దాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాల్లేవ్ ఈ భావనలో ఎలాంటి వివాదానికి తావులేదు పురావస్తుశాఖ నివేదికను ఊహాజనితమని కొట్టిపారేయలేం రాముడు అయోధ్యలోనే జన్మించారని హిందువుల విశ్వాసం మతపరమైన విశ్వాసాల్లో కోర్టు జోక్యం చేసుకోదు హిందువుల నమ్మకం నిజమైనది కాదనడానికి ఆధారాల్లేవ్ ఈ నమ్మకం, విశ్వాసాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులను నిర్ణయించలేం న్యాయసూత్రాల ఆధారంగానే భూ యాజమన్యాన్ని నిర్ణయించాలి విగ్రహాన్ని పెట్టడం అంటే మత దూషణ కిందికే వస్తుంది [ 11:00 am ]
  • మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం:- వివాదాస్పద స్థలంలో హిందువులు పూజలు చేసేవారని.. ఆధారాలు ఉన్నాయి: సీజేఐ ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేసేవారని ఆధారాలున్నాయి: సీజేఐ మసీదు నిర్మాణం కోసం మందిరాన్ని కూల్చినట్లు సాక్ష్యాలు లేవు రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందింది పురావస్తుశాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం: సీజేఐ నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నాం వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదు: సీజేఐ బాబ్రీ మసీదు కూల్చివేత సమన్యాయ సూత్రాలకు విరుద్ధం: సీజేఐ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం: సీజేఐ [ 11:07 am ]
  • ముస్లీంలకు ప్రత్యామ్నాయ స్థలం:- సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు అలహాబాద్‌ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం వివాదాస్పద భూభాగాన్ని ... అలహాబాద్‌ హైకోర్టు 3 భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదు: సీజేఐ మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి: సీజేఐ [ 11:13 am ]
  • సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు అలహాబాద్‌ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి కేంద్రానికి మూడు నెలల గడువు ఇచ్చిన కోర్టు అయోధ్య చట్టం కింద ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశం నిర్మొహి అఖాడ వాదనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు 1993లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న స్థలానికి వెలుపల.. సున్నీ వక్ఫ్‌బోర్డుకు స్థలం కేటాయింపు: సుప్రీంకోర్టు ట్రస్ట్‌ ద్వారానే రామాలయ నిర్వహణ: సుప్రీంకోర్టు వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగింత [ 11:17 am ]
  • అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదు వివాదాస్పద స్థలం రాంలాలాకే చెందుతుంది వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు కేటాయించాలి 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్ట్‌కు వెంటనే అప్పగించాలి అయోధ్య రామమందిర నిర్మాణానికి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అనుమతి మూడు నెలల్లో అయోధ్య చట్టం కింద ట్రస్ట్ ఏర్పాటు చేయండి [ 11:20 am ]

More News

‘ఎవరూ చేయని పని వైఎస్ జగన్ చేస్తున్నారు’

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని విజయం సొంతం చేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కమ్మరాజ్యం నుంచి ‘పప్పులాంటి అబ్బాయ్..’ పాటొచ్చేసిందోచ్!

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.. ఏం చేసినా సంచలనమే. సినిమా తీసినా.. ట్విట్టరెక్కి ట్వీట్ చేసినా అది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.

పోలవరంపై ఉదయం షాకింగ్.. సాయంత్రం గుడ్ న్యూస్!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరంపై గత కొన్ని రోజులుగా ఇటు కోర్టులు...

అనారోగ్యంపై స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్న యాంకర్ ప్రదీప్

టాలీవుడ్ టాప్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్.. గత కొన్నిరోజులుగా స్క్రీన్‌పై కనపించకపోవడంతో అసలేం జరిగింది..?

మ‌రో హీరోయిన్‌తో క‌మ‌ల్ రిలేష‌న్‌లో ఉన్నాడా?

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ఒక‌రు. ఈయ‌న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆరు ద‌శాబ్దాలు దాటింది.