ఫిబ్రవరి 28న ధనుష్ 'లోకల్ బాయ్'

  • IndiaGlitz, [Monday,February 17 2020]

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'మారి'లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. 'ధర్మయోగి'లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. తమిళ ప్రాచీన యుద్ధవిద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన 'లోకల్ బాయ్'తో ఈ నెలాఖరున తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేశారు. 'ధర్మయోగి'ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌, ఈ 'లోకల్ బాయ్'ను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా 'పటాస్'. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ', 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2', 'ఎంత మంచివాడవురా' సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. స్నేహ మరో హీరోయిన్. 'అరవింద సమేత వీరరాఘవ', 'ఎవరు' సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తుస్తున్నారు.

నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఈ నెల 28న విడుదలవుతున్న సినిమాకు కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్... సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ధర్మ యోగి' తెలుగులో మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం. ఇప్పుడు ఈ సినిమానూ మేమే విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది అని అన్నారు.

More News

పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

ఇప్పుడున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్రకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా మంది ప్లే లిస్ట్స్ లో ఈయన సంగీతం అందించిన పాటలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.

హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్,టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

`జాను` వ‌ల్ల దిల్‌రాజుకి న‌ష్ట‌మెంతో తెలుసా?

ఎంత గొప్ప మేక‌ర్ అయినా కొన్ని సినిమాలను అంచ‌నా వేయ‌డంలో త‌ప్పులు చేస్తుంటారు.

సురేంద‌ర్ రెడ్డి, వ‌రుణ్‌తేజ్ సినిమా అందుకే ఆగిందా?

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి హిస్టారిక‌ల్ సినిమా చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.

చిన్మ‌యి క్ష‌మాప‌ణ‌లు చెబితేనే చోటిస్తాం:  రాధా ర‌వి

డ‌బ్బింగ్ కళాకారుల సంఘం అధ్య‌క్షుడిగా ఎన్నికైన సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.