లాక్ డౌన్ 5.0 : అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేత

  • IndiaGlitz, [Sunday,May 31 2020]

న్యూ ఢిల్లీ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం జూన్-30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు 5.0 లాక్‌డౌన్‌కు సంబంధఇంచిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేసింది. ఈ పాస్‌లు, ప్రత్యేక అనుమతులు లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాగా.. జూన్-08 నుంచి రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు, సరకుల రవాణా ఉంటుంది. ఇదివరకున్న కర్ఫ్యూ టైమింగ్స్‌లో కూడా కేంద్రం మార్పులు చేసింది.

ఇకపై రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉండనుంది. అదే విధంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగింపు ఉండనుంది. ఇదిలా ఉంటే.. అయితే ఏదైనా రాష్ట్రం కానీ, కేంద్ర పాలిత ప్రాంతం కానీ ప్రజారోగ్యం, పరిస్థితుల అంచనాలను బట్టి వ్యక్తుల కదలికలపై నియంత్రణలు అమలు చేయవచ్చని 5.0 నిబంధనల్లో పేర్కొంది. అలాంటి కదలికలకు సంబంధించి విధివిధానాలపై ముందుగా పబ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

More News

జూన్-30 వరకు 5.0 లాక్ డౌన్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను పొడిగించింది.

స‌మంత టెర్ర‌స్ గార్డెనింగ్

ప్ర‌స్తుతం సినీ సెల‌బ్రిటీలు, సామాన్యులు అంద‌రూ ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఏదీ ప‌డితే అది కొనేయాల‌నుకోవ‌డం లేదు.

మ‌హేశ్ 27 ‘స‌ర్కారు వారి పాట‌’

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ఈ సినిమా టైటిల్ లోగోను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశారు.

నిన్న బాలయ్య.. ఇవాళ ఏకంగా టీడీపీనే టార్గెట్ చేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. నిన్న, మొన్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన

ఆ అకౌంట్‌కు.. నాకు ఎలాంటి సంబంధం లేదు : రావు రమేష్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకుని.. అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది.