లాక్ డౌన్ 3.0 : మే-17 వరకూ పొడిగింపు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది. కంటైన్మెంట్‌ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమలు కానున్నాయి. ఇదిలా ఉంటే.. ఇదివరకటి లాగే రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాలపై నిషేధం కొనసాగనుంది. రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తేల్చిచెప్పింది. కాగా.. రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

వీటిపై కూడా..

వీటితో పాటు.. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదని హోం శాఖ స్పష్టంచేసింది. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్పోర్ట్ కాంప్లక్సులపై కూడా నిషేధం కొనసాగనుంది. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగనున్నాయి. మతపరమైన కార్యక్రమాలకు జనాలు గుమికూడటంపై కూడా నిషేధం కొనసాగనుందని కేంద్రం ప్రకటనలో నిశితంగా వివరించింది.

More News

ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. ఇంటికెళ్లలేక అక్కడే ఉండలేక ఇన్నిరోజులూ

యువ నటుడికి కరోనా.. కాలు తొలగింపు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎవర్నీ వదలట్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు కరోనా బారీన పడి కోలుకుంటుండగా..

స‌మంత కుక్క మాట్లాడితే..!

కుక్క మాట్లాడ‌మేంటి? అని అనుకుంటున్నారా!.. నిజం కాదులెండి ఉహ మాత్ర‌మే. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల సామాన్యులే కాదు, సినీ సెల‌బ్రిటీలు సైతం ఇళ్ల‌కే ప‌రిమిత‌మైయారు.

ఆ విష‌యాన్ని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన బోయ‌పాటి

మాస్ యాంగిల్‌లో సినిమాలు చేసే ద‌ర్శకుల్లో బోయ‌పాటి శ్రీను ఒక‌రు. ప్ర‌స్తుతం ఈయ‌న నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మూడో సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఆన్‌లైన్ కోర్సు నేర్చుకుంటోన్న డైరెక్ట‌ర్ తేజ‌

లాక్‌డౌన్ స‌మ‌యంలో అంద‌రూ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అదే స‌మయంలో దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని ఎవ‌రు తోచిన‌ట్లు వారు ఉప‌యోగించుకుంటున్నారు. ఇంటి ప‌నులు, వంట ప‌నులు