'లవ్ స్టోరి' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,November 18 2020]

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''. ఈ రియలిస్టిక్ ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ''లవ్ స్టోరి'' సినిమా తాజాగా పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు.

నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో ''లవ్ స్టోరి'' సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. థియేటర్లు తెరుచుకుని, హాల్స్ దగ్గర ఆడియెన్స్ సందడి మొదలు కాగానే ''లవ్ స్టోరి'' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు
చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.