తెలంగాణలో క్రాకర్స్ బ్యాన్‌పై సుప్రీంలో లంచ్ మోషన్ పిటిషన్..

  • IndiaGlitz, [Friday,November 13 2020]

క్రాకర్స్ బ్యాన్‌పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ కోరింది. ఇప్పటికే షాపులలో స్టాకును నింపామని అసోసియేషన్ పిటిషన్‌లో తెలిపింది. పండుగ రెండు రోజుల ముందు బ్యాన్ విధిస్తే తాము కోట్లల్లో నష్టపోతామని పిటిషనర్ పేర్కొన్నారు.

పెను నష్టాన్ని నివారించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని పిటిషనర్ పేర్కొన్నారు. అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా.. దీపావళి పండుగపై హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలివ్వాలంటూ ఇంద్ర ప్రకాష్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఆ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇప్పటి వరకూ తెరిచిన షాపులన్నింటినీ మూసి వేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను సైతం జారీ చేసింది.

More News

లేటెస్ట్‌ మూవీ లుక్‌ విడుదల చేసిన విజయ్‌ ఆంటోని

'నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని.

ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా!

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివాహమై ప్రభుదేవాకు పిల్లలున్నారు.

క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగిల్ హ్యాండ్‌తో చుక్కలు చూపించారు.. కానీ సీఎం సీట్ జస్ట్ మిస్..

ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అయితే ఆర్‌జేడీ అధినేత, మహాకూటమి సారథి తేజస్వి యాదవ్‌ ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఇచ్చారు.

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అన్న విషయం ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే అభిమానులకు నేడు చిరు గుడ్ న్యూస్ చెప్పారు. నిజానికి ఆయనకు కరోనా సోకలేదని..