close
Choose your channels

సంజ‌య్ ద‌త్‌కు లంగ్స్ క్యాన‌ర్!!

Wednesday, August 12, 2020 • తెలుగు Comments

సంజ‌య్ ద‌త్‌కు లంగ్స్ క్యాన‌ర్!!

బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌కి మూడు రోజుల క్రితం శ్వాస‌కోశ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయినప్పుడు ఆయ‌న అభిమానులు, సినీ అభిమానులు ఏమైందో ఏమోన‌ని కంగారు సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న డిశ్చార్జ్ అయ్యారు. ఆ స‌మయంలో ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా నెగ‌టివ్ అని కూడా వ‌చ్చింది. దీంతో అంద‌రూ ఏం కాలేదులే అనుకున్నారు. సంజ‌య్ ద‌త్ సైతం తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని వెల్ల‌డించారు. కానీ ఆయ‌న అలా ప్ర‌క‌టించి గంట‌లు దాటిందో లేదో ఓ షాకింగ్ విష‌యం తెలిసింది.

అదేంటంటే.. సంజ‌య్ ద‌త్‌కు లంగ్స్ క్యాన్స‌ర్ అని.. ప్ర‌స్తుతం ఈ క్యాన్స‌ర్ మూడో ద‌శ‌కు చేరుకుంది. దీంతో ఆయ‌న‌కు వెంట‌నే చికిత్స అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్స్ సూచించార‌ట‌. ఆయ‌న వెంట‌నే చికిత్స కోసం ఆమెరికా వెళుతున్న‌ట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు సంజ‌య్ ద‌త్‌ సినిమాల‌కు దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. దీంతో ఆయ‌న క‌మిట్ అయిన సినిమాలు కొన్నిరోజులు ఆగ‌క‌త‌ప్పేలా లేదు. ఈయ‌న క‌మిట్ అయిన చిత్రాల్లో ప్యాన్ ఇండియా మూవీ కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2 కూడా ఉండ‌టం విశేషం. ఇందులో సంజ‌య్ ద‌త్ అధీరా అనే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో కనిపించ‌నున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz