ఇంకా విధుల్లో చేరని ‘ఎల్వీ’.. అసలేం జరుగుతోంది!

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏరి కోరి మరీ తెచ్చుకున్న ఈయన్ను అసలెందుకు బదిలీ చేశారో.. అది కూడా సీఎస్ హోదా నుంచే బదిలీ చేయడంపై రోజురోజుకూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అయితే.. సీఎస్ నుంచి గుంటూరు జిల్లా బాపట్లలోని ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తాత్కాలిక సీఎస్ నీరబ్ కుమార్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పగించారు.

అయితే ఉత్తర్వులు జారీ చేసి 48 గంటలు గడిచినప్పటికీ ఆయన మాత్రం ఇంతవరకూ విధుల్లో చేరలేదు. అంతేకాదు.. కనీసం బాధ్యతలు కూడా స్వీకరించకపోవడం గమనార్హం. వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టి వెళ్లిపోవడంతో ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో తెలుసుకోవచ్చు!. అయితే ఆయన అసలు విధుల్లో చేరతారా..? లేకుంటే చేరకుండా విరమణ తీసుకుంటారా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఎల్వీ మనసులో ఏముందో తెలియాలంటే వచ్చే నెల 6 వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

జగన్ కీలక నిర్ణయం.. ‘తెలుగు’కు కాలం చెల్లిపోయింది!?

అవును మీరు వింటున్నది నిజమే.. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగు’కు కాలం చెల్లిపోనుంది.

తహసీల్దార్ హత్యకేసు: నిందితుడి భార్య ఏమందంటే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి కేసు వ్యవహారంపై రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తోంది.

‘యాక్షన్‌' చిత్రంలోని ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా... పాటకు గుడ్‌ రెస్పాన్స్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌'.

విడుదలకు సిద్ధమైన 'కోనాపురంలో జరిగిన కథ'

అనిల్ మొగిలి, రేయాన్ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కోనాపురంలో జరిగిన కథ.

లెక్క తేల్చేస్తున్న శ్రియా శ‌ర‌న్‌

శ్రియా శ‌ర‌న్ లెక్క స‌రిచేస్తుందా? అంటే అవుననే సమాధానం విన‌ప‌డుతుంది. ఇంత‌కు శ్రియ ఏ విష‌యంలో లెక్క స‌రిచేస్తుందనే వివరాల్లోకెళ్తే..