లైకా ప్రొడక్షన్స్ అధినేత భారీ విరాళం.. సీఎం స్టాలిన్ ని కలిసి..

  • IndiaGlitz, [Saturday,June 19 2021]

కరోనా విపత్కర సమయంలో సాయం అందించేందుకు వరుసగా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కొందరు సొంతంగా సహాయ కార్యక్రమాలు చేపడుతుంటే మరికొందరు ప్రభుత్వాలకు విరాళాలు అందిస్తున్నారు. ఇటీవల తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

ఇదీ చదవండి: అతడే నా బెస్ట్ మొగుడు అంటూనే విడాకులు.. 3 పెళ్లిళ్లు, ఆమెకు ఏమైనా తిక్కా!

దీనితో కోలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా స్టాలిన్ ని కలుస్తున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ తమిళనాడు సీఎం సహాయ నిధికి రూ 2 కోట్ల విరాళం అందించారు. కోవిడ్ నివారణ చర్యలకోసం సుభాస్కరన్ ఈ గొప్ప సాయం అందించారు.

సుభాస్కరన్ తరుపున లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు శ్రీ జీకేఎం తమిళ్ కుమరన్, శ్రీ నిరుతన్, శ్రీ గౌరవ్ తదితరులు ముఖ్యమంత్రి స్టాలిన్ ని సచివాలయంలో కలుసుకున్నారు. రూ.2 కోట్ల చెక్ ని ఆయనకు అందించారు.

విజయ్ 'కత్తి', రజనీకాంత్ 2.0 లాంటి భారీ చిత్రాలని లైకా సంస్థ నిర్మించింది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్ర విషయంలో లైకా సంస్థకు, దర్శకుడు శంకర్ కు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియన్ 2 ప్రారంభమై కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఇలాంటి తరుణంలో విభేదాలు చెలరేగాయి.

More News

పవన్, రానా మూవీ క్రేజీ అప్డేట్.. ఇక పోలీస్ స్టేషన్ లో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి అయ్యప్పన్ కోషియం రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పిక్ టాక్: బికినీలో రెచ్చిపోయిన జాన్వీ కపూర్ చెల్లి

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.

అతడే నా బెస్ట్ మొగుడు అంటూనే విడాకులు.. 3 పెళ్లిళ్లు, ఆమెకు ఏమైనా తిక్కా!

హాట్ నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ గురించి తెలియని వారుండరు. మోడలింగ్ ప్రపంచంలో ఒక ఊపు ఊపిన నటి కిమ్.

నేను అభిమానించే దర్శకులలో శేఖర్ కమ్ముల సర్ ఒకరు: ధనుష్

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాన్ని ఎలా హద్దుకోవాలో శేఖర్ కమ్ములకు బాగా తెలుసు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు కమ్ముల చిత్రాలు పూర్తిగా భిన్నం.

లెజెండ్రీ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి.. మోడీ, కోవింద్, సచిన్ దిగ్భ్రాంతి!

లెజెండ్రీ అథ్లెట్, ప్లైయింగ్ సిఖ్ గా పేరుగాంచిన మిల్కా సింగ్(91) తుదిశ్వాస విడిచారు. గత నెలరోజులుగా మిల్కా సింగ్ కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి ఆయన్ని