close
Choose your channels

'విక్రమ్'లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్

Monday, September 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్రమ్లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్

' విక్రమ్' చిత్రంలోని " *కలయా నిజమా.."* అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు. నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో* ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.

కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.

అనంతరం ముఖ్య అతిథి చంద్రబోస్ మాట్లాడుతూ, "కలయా నిజమా... అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణంపోశాయి. సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని అన్నారు.

విక్రమ్లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్

చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ, "చిత్రంలో అద్భుతమైన సాహిత్యం కలిగిన ఈ పాటను చంద్రబోస్ గారు ఆవిష్కరించడం ఎనలేని ఆనందంగా ఉంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఏ పాటకు ఆ పాట పోటాపోటీగా అలరింపజేస్తాయి. సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది. అక్టోబర్లో అనుకూలమైన మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ,"సంగీతభరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచాం. విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా... మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి. తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాం" అని అన్నారు.

విక్రమ్లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్

సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇందులోని ఐదు పాటలు సందర్భానుసారంగా సాగుతూ కథను ముందుకు నడిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చిందని చెప్పగా...

కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ, ఇందులోని అన్ని పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని అన్నారు.

విక్రమ్లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్

నాగవర్మ బైర్రాజు, దివ్యాసురేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, *నిర్మాత: నాగవర్మ బైర్రాజు, దర్శకత్వం హరిచందన్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.