సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు మాతృవియోగం

  • IndiaGlitz, [Monday,May 20 2019]

టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. బోస్ తల్లి మదనమ్మ సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా గుండెపోటు వ్యాధితో బాధ పడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మీడియా తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ నటీనటులు, దర్శకులు, తోటి రచయితలు ప్రగాఢ సంతాపం తెలిపి.. బోస్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఇవాళ సాయంత్రం వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా.. బోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు, తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరి వాడు. ముందు డిప్లోమా, ఆ తరువాత ఇంజనీరింగ్ చదివిన బోస్.. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళి అవకాశాలు సంపాదించుకుని ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌లో ఒకరుగా నిలిచారు.

More News

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చంద్రబాబు ఏమన్నారంటే...

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు గాను ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడైన సంగతి తెలిసిందే.  ఏపీలో టీడీపీనే అధికారంలోకి వస్తుందని లగడపాటి సర్వే...

మే 31న 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' విడుద‌ల‌

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌'. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌

నాజ‌ర్‌ పై సోద‌రుల ఆరోప‌ణ‌లు

సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్‌ పై అత‌ని సోద‌రులు ఆయ‌బ్‌, జ‌వ‌హ‌ర్ మీడియా ముఖంగా ఆరోప‌ణ‌లు చేశారు. నాజ‌ర్ కుటుంబంలో న‌లుగురు అబ్బాయిలు అందులో చివ‌రి వాడు మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు.

బ‌న్నీ సిస్ట‌ర్ సెంటిమెంట్

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ కూడా పూర్త‌య్యింది. త‌ర్వ‌లోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

మాట నిల‌బెట్టుకున్న లారెన్స్‌

కొరియోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడిగా ఎదిగిన రాఘ‌వ లారెన్స్ సినిమాల‌తో పాటు స‌మాజ సేవ కూడా చేస్తుంటాడు. గుండె జ‌బ్బుతో బాధ‌ప‌డే చిన్న‌పిల్ల‌ల‌కు ఆప‌రేష‌న్‌