మీ టూ వైర‌ముత్తు

  • IndiaGlitz, [Tuesday,October 09 2018]

త‌నుశ్రీ ద‌త్తా.. నానా ప‌టేక‌ర్ మ‌ధ్య చేల‌రేగిన కాస్టింగ్ కౌచ్ ప్ర‌కంప‌న‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. బాలీవుడ్‌లో తను శ్రీ ద‌త్తా మీ టూ ఉద్య‌మాన్ని స్టార్ట్ చేస్తే.. ద‌క్షిణాదిన చిన్మ‌యి మీ టూ ఉద్య‌మాన్ని స్టార్ట్ చేసింది. ఈ వేధింపులు లిస్టులో మ‌రో బాధితురాలు చేరింది. ప్ర‌ముఖ త‌మిళ ర‌చ‌యిత వైర‌ముత్తు త‌న‌ను లైంగికంగా వేధించార‌ని స‌దరు బాధితురాలు తెలిపారు. ఆ బాధితురాలు చెప్పిన విష‌యాల‌ను సంధ్యామీన‌న్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. జాతీయ అవార్డులు స‌హా ప‌ద్మ విభూష‌ణ్ అవార్డుని గెలుచుకున్న వైర‌ముత్తు ఓ యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

''నేను వైర ముత్తు ద‌గ్గ‌ర 18వ ఏట నుండి ప‌నిచేశాను. ఆయ‌నొక లెజెండ్‌గా చూశాను. కానీ ఆయ‌న నిజ స్వ‌రూపం తెలిశాక భ‌య‌మేసింది. సాహిత్యాన్ని వివ‌రించాల‌నే ఉద్దేశంతో న‌న్ను ద‌గ్గర‌కు పిలిపించుకుని ముద్దు పెట్టుకునేవాడు.. కౌగిలించుకునేవాడు. ఏం చేయాలో తోచ‌లేదు. ఓకే చెప్పి బ‌య‌ట‌ప‌డ్డాను. ఒంటిరిగా ఉండ‌టానికి భ‌య‌ప‌డి.. న‌లుగురితో ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాను. ఆయ‌న గురించి అంద‌రికీ తెలిసినా.. అత‌నికున్న రాజ‌కీయ సంబంధాల కార‌ణంగా ఎవ‌రూ నోరు మెద‌ప‌రు. బాధితుల మౌనాన్ని ఆయ‌న ఆస‌రాగా తీసుకుని మ‌రింత రెచ్చిపోయేవాడు' అంటూ బాధితురాలు ఆరోపించింద‌ని సంధ్యామీన‌న్ పెర్కొన్నారు. ఈ ఆరోప‌ణ‌లపై చిన్మ‌యి, అముద‌న్ అనే ద‌ర్శ‌కుడు స్పందించారు.

More News

ప్ర‌ధాని పాత్ర‌లో మోహ‌న్‌లాల్‌...

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌రోసారి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇంత‌కు ఆ పాత్ర ఏంటో అనుకుంటున్నారా!

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా పాత్ర ఏంటంటే?

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'..' వీర రాఘ‌వ‌' ట్యాగ్ లైన్.

బాల‌య్య అభిమానుల‌కు షాకిచ్చిన వీకిపీడియా

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణకు ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల్లో బాల‌కృష్ణ ఒక‌రు.

సన్నీకి క‌ర్ణాట‌క‌లో ఎదురుగాలి...

పోర్న్ మూవీస్ నుండి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సన్నీలియోన్ ఇప్పుడు 'వీర‌మ‌హాదేవి' యుద్ధ నారిగా క‌న‌ప‌డ‌నున్నారు.

'అర‌వింద స‌మేత' సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'.... 'వీర రాఘ‌వ‌'.