20 ఏళ్ల 'మా నాన్న పెళ్ళి'

  • IndiaGlitz, [Tuesday,December 05 2017]

చిన్నప్పుడే తల్లి చనిపోయిన కొడుకుని.. పెంచి పెద్ద చేయడం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఓ తండ్రికి.. మళ్ళీ పెళ్లి చేయాలనుకునే కొడుకు కథే 'మా నాన్నకు పెళ్లి'. 1984లో సుహాసిని హీరోయిన్ గా వచ్చిన 'స్వాతి' సినిమాకు రివర్స్ ట్రీట్మెంట్ సినిమాయే ఈ చిత్రం. ఆ సినిమాలో క‌థానాయిక త‌న త‌ల్లి శార‌ద‌కి మ‌ళ్ళీ పెళ్లి చేస్తే.. మా నాన్న‌కి పెళ్ళిలో క‌థానాయ‌కుడు త‌న తండ్రికి మ‌ళ్ళీ పెళ్ళి చేస్తాడు.

ద‌ర్శ‌కుడు ఇ.వి.వి.సత్యనారాయణ.. తను రాసుకున్న ఈ కథని చాలా చక్కగా, కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ విధంగా మలుచుకున్నారు. రోజా మూవీస్ ప‌తాకంపై సీనియ‌ర్ నిర్మాత అర్జున రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తండ్రి పాత్రలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించగా.. కొడుకుగా శ్రీకాంత్, కృష్ణంరాజు తండ్రిగా కోట శ్రీనివాసరావులు నటించారు.

శ్రీ‌కాంత్ కి జోడీగా సిమ్రాన్‌, కృష్ణంరాజుకి జోడీగా అంబిక న‌టించారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి రెండు నంది అవార్డులు వచ్చాయి. ఒకటి ఉత్త‌మ హాస్య‌న‌టుడుగా ఎం.ఎస్.నారాయణకి ద‌క్కితే.. రెండోది ఉత్త‌మ‌ కుటుంబ కథా చిత్రంగా నిర్మాత అర్జున్ రాజు అందుకున్నారు.

వేటూరి, సిరివెన్నెల, షణ్ముఖ శర్మ, చంద్రబోసు ఈ సినిమాకి పాటలు రాసారు. ముఖ్యంగా "ఓ జాబిలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మ" పాట అప్పట్లో మంచి జనాదరణ పొందింది. కోటి స్వరపరచిన ఆరు పాటలు సినిమాకి అదనపు బలమనే చెప్పాలి. అలాగే ఎం.ఎస్.నారాయణతో చేయించిన ఇ.వి.వి. మార్కు తాగుబోతు కామెడీ పాత్ర‌ సినిమాకి ప్లస్.

ఈ సినిమా తర్వాత ప్రతి డైరెక్టర్ కూడా ఎం.ఎస్.తో అటువంటి కామెడీనే కోరుకున్నారంటే.. ఈ సినిమాలో కామెడీకి ఇ.వి.వి. ఏవిధంగా తనదైన ముద్ర వేసారో అర్ధం చేసుకోవచ్చు. డిసెంబర్ 5, 1997న రిలీజైన మా నాన్న‌కి పెళ్ళి.. నేటితో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

విడుద‌ల‌కు ముందే ప‌వ‌న్ రికార్డులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అజ్ఞాత‌వాసి'. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు.

మెగా హీరో సినిమాను సొంతం చేసుకున్న దిల్‌రాజు

త‌న స్వంత బ్యాన‌ర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ ఏడాది విడుద‌లైన ఫిదా చిత్రంలో న‌టించిన హీరో వ‌రుణ్ తేజ్ కోసం..నిర్మాత దిల్‌రాజు ఓ స‌పోర్ట్ చేశాడ‌ట. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం నటిస్తున్న చిత్రం 'తొలి ప్రేమ‌'.

థ్రిల్లర్ వెర్సస్ కామెడీ ఎంటర్ టైనర్

చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటి.. ఓసారి కలిసి నటించిన వాళ్ళే.. మరోసారి పోటీపడడం. ఇలాంటి పరిస్థితే కథానాయకుడు మంచు విష్ణు, అగ్ర కథానాయిక అనుష్క విషయంలో జరుగనుంది.

ఆ సినిమాకు సీక్వెల్ వ‌స్తోంది..

12 ఏళ్ల క్రితం విడుద‌లై సూప‌ర్‌హిట్ సాధించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎవ‌డి గోల‌వాడిది'. స్వ‌ర్గీయ ద‌ర్శ‌కుడు ఈ.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆర్య‌న్ రాజేష్, దీపిక హీరో హీరోయిన్లుగా న‌టించారు.

అతిథిగా సునీల్

2000లో వచ్చిన ‘నువ్వే కావాలి’ సినిమాతో కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు సునీల్. తర్వాత 2006లో వచ్చిన ‘అందాల రాముడు’తో హీరోగా టర్న్ అయ్యారు.