ప్రభుత్వం ఇన్విటేషన్ పంపింది, నాన్నకి అందనివ్వలేదు.. ఎవరిపనో తెలుసు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో సినిమా స్టూడియో కడతానని.. అందుకు ప్రభుత్వ సహకారం కోసం మళ్లీ వచ్చి కలుస్తానని విష్ణు తెలిపారు. శ్రీ విద్యానికేతన్‌ స్థాపించి 30 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు అది మోహన్‌బాబు యూనివర్సిటీ అయిందని ఆయన గుర్తుచేశారు. అందులో పలు ఫిల్మ్‌ కోర్సులు మొదలు పెడతామని.. వాటి గురించి మరోసారి వివరిస్తానని విష్ణు పేర్కొన్నారు.

తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే తామూ అక్కడే ఉంటామని... రెండు రాష్ట్రాలూ సినీ పరిశ్రమకు రెండు కళ్లు అని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో పరిశ్రమ స్థాపన గురించి.. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో కలిసి మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంటానని విష్ణు తెలిపారు. అలాగే ఇటీవల సీఎం జగన్‌తో పలువురు సినీ ప్రముఖులు భేటీ అయ్యారని.. ఈ సమావేశానికి నాన్నతో పాటు, మరో ఇద్దరు ముగ్గురు హీరోలకూ ఆహ్వానం పంపారని ఆయన తెలిపారు. కానీ, ఆ ఆహ్వానాన్ని నాన్నకు అందకుండా చేశారని, అలా ఎవరు చేశారో మాకు తెలుసునంటూ మంచు విష్ణు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే పేర్ని నానితో ఇటీవల మోహన్‌బాబు భేటీ అయిన వ్యవహారంపైనా విష్ణు స్పందించారు. ఈ వ్యవహారంపై కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫంక్షన్‌కు పేర్ని నాని వచ్చారని.. ఈ సందర్భంగా బ్రేక్‌ఫాస్ట్‌కు ఇంటికి రమ్మని మంత్రిని నాన్నగారు ఆహ్వానించారని మంచు విష్ణు తెలిపారు. టికెట్‌ రేట్లతో పాటు, చాలా విషయాలు మాట్లాడుకున్నామని.. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ చొరవను అభినందిస్తూ ‘థ్యాంక్యూ’ అని ట్వీట్‌ పెట్టానని విష్ణు చెప్పారు. కానీ, ఆ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకుని, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారని ఆయన మండిపడ్డారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబమన్న ఆయన... మాకు సమస్య వస్తే మేమంతా కలిసి మాట్లాడుకుంటామని విష్ణు తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో చోటు చేసుకున్న వివాదాల వల్లే నాకు ఆహ్వానం రాలేదనడం అవాస్తవం అని ఆయన ఖండించారు.

More News

యువ ప్రేక్షకులకు నచ్చేలా "వర్జిన్ స్టోరి" ఉంటుంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.

పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ బాసట.. అన్నదాతల ఖాతాల్లోకి రూ.542 కోట్లు విడుదల

రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ స్కామ్‌లో దోషిగా నిర్ధారణ, మరోసారి జైలుకు తప్పదా..?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

జగన్ వద్దకు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా, ఇండస్ట్రీ చూపంతా అటే

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై గత వారం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖల బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘‘కళావతి’’.. మేకింగ్ కోసం అంత ఖర్చా..?

మారుతున్న కాలానికి తగ్గట్టుగా చిత్ర పరిశ్రమలోనూ రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.