'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టినరోజు వేడుకలు

  • IndiaGlitz, [Monday,February 26 2018]

'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుక‌లు సోమ‌వారం ఉదయం 'మా' కార్యాల‌యంలో నిడారంబ‌రంగా జ‌రిగాయి. 'మా' కార్య‌వ‌ర్గ స‌భ్యులు..ప‌లువురు ఆర్టిస్టులు కేక్ క‌ట్ చేసి శివాజీ రాజాకు తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా 'మా' కోసం పాటుప‌డుతోన్న శివాజీ రాజా నిరంత‌ర కృషిని కొనియాడారు.

ఈ వేడుక‌ల్లో సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ఎస్. వి. కృష్ణారెడ్డి, 'మా' ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నరేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య వ‌ర్గ స‌భ్యులు సురేష్‌, గీతాసింగ్, వెంక‌ట గోవింద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. అలాగే ప్ర‌తీ ఏడాది శివాజీ రాజా పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుప‌త్రిలో రోగుల‌కు ప‌ళ్లు పంచుతుంటారు. ఈ ఏడాది కూడా త‌న బ‌ర్త్డ డే సంద‌ర్భంగా య‌ధావిధిగా ప‌ళ్లు పంచ‌డం జ‌రిగింది.

More News

ఒక గొప్ప స్టార్ ను కోల్పోయాము : డా. కే.ఎల్. నారాయణ

శ్రీదేవి లాంటి గొప్ప స్టార్ తో 'క్షణక్షణం'చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానూ,గర్వాంగానూ ఉండేదని,అయితే ఆమె హఠాత్తుగా మృతి చెందడం భారతీయ సినిమా రంగానికే తీరని లోటని నిర్మాత డా.కే.ఎల్.నారాయణ చెప్పారు.

ఘ‌నంగా 'దండుపాళ్యం -3' ఆడియో ఫంక్ష‌న్‌

దండుపాళ్యం గ్యాంగ్ కి క‌న్న‌డ‌లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రాజు రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. అలా చేసిన‌  దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి.

'శ్రీదేవి' మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు - డా.టి. సుబ్బరామి రెడ్డి

'శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు, ఆప్తురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేవారు.

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో అనుష్క‌?

'భాగమతి' సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు సీనియ‌ర్ క‌థానాయిక‌ అనుష్క. ప్రస్తుతం స్వీటీ కొత్త‌ కథలను వినే క్రమంలో ఉన్నారు.

క‌ళ్యాణ్ రామ్‌ 'నా నువ్వే' ఎప్పుడంటే..

నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా క‌లిసి నటిస్తున్న‌ చిత్రం 'నా నువ్వే'. ఇంత‌కుముందు సిద్ధార్థ్, నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ కాంబినేష‌న్‌లో '180' వంటి ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించిన జయేంద్ర  ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.