మ్యాచ్ రద్దు..‘వందేమాతరం’ అంటూ దద్దరిల్లిన స్టేడియం!

  • IndiaGlitz, [Monday,January 06 2020]

టీమిండియా- శ్రీలంక మధ్య గౌహతి వేదికగా జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు టాస్ వేసినప్పటికీ వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దీంతో ఒక్కటంటే ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. 6.45 నుంచి భారీగానే వర్షం కురిసింది. టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గౌహతి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుందన్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఛేజింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. మ్యాచ్‌కు ముందు మొదలైన వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఎల్లుండి ఇండోర్‌లో జరగనుంది.

దద్దరిల్లిన స్టేడియం!

ఇదిలా ఉంటే.. మ్యాచ్ తిలకించడానికి వచ్చిన భారతీయులు, క్రీడాభిమానులు ఒక్కసారిగా లేచి ‘వందేమాతరం.. వందేమాతరం’ అంటూ పాట పాడారు. ఈ పాటతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఈ పాటతో క్రీడాభిమానులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ కూడా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మ్యాచ్ రద్దయ్యిందని కొందరు నిరాశగా ఉన్నప్పటికీ ఈ వీడియో చూసి ఎంతగానో సంతృప్తి పడ్డామని నెటిజన్లు, క్రీడాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు ఈ వీడియో చూసినోళ్లకు గూస్‌బంప్స్ అని.. అందరి నోటా ఒకేసారి ఈ పాట రావడం నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తూ.. బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ పాటను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక ఆలస్యమెందుకు మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'ఎంత మంచివాడ‌వురా'

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`.

'పసివాడి ప్రాణం' ఫస్ట్ లుక్ విడుదల

పూజ్యులు డిప్యుటీ CM శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు  ధన్ శ్రీ ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమా “పసివాడి ప్రాణం” టైటిల్ రిలీజ్ చేయటంమాకెంతో ఆనందం

’సరిలేరు నీకెవ్వరు’ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంది - మెగాస్టార్ చిరంజీవి

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై

'ది గ్రేట్ గ్యాంబ్లర్' ట్రైలర్ లాంచ్

పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సమర్పణలో శ్రీ సింహ వాహిని పతాకంపై…ధర్మ కీర్తిరాజ్,అర్చన రావ్,సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ నటినటులుగా

'ఉత్తర’కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. థియేటర్స్ పెరుగుతున్నాయి - దర్శకుడు తిరుపతి యస్ ఆర్.

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఉత్తర కు రెస్సాన్ బాగుంది.