‌'గుండె క‌థ వింటారా' చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న మ‌ధునంద‌న్‌

  • IndiaGlitz, [Wednesday,March 03 2021]

ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, గీతాంజ‌లి, ఒక లైలా కోసం, టాక్సీవాలా త‌దిత‌ర స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్‌లో న‌టించిన పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ 'గుండె క‌థ వింటారా' అత‌నే విల‌క్ష‌ణ థ్రిల్ల‌ర్‌తో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

వంశీధ‌ర్ ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రామిసింగ్ హీరో అడివి శేష్ ఈ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ చేశారు. గుండె క‌థ వింటారా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ అమేజింగ్‌గా ఉన్నాయి. మ‌ధునంద‌న్‌కు, మొత్తం టీమ్‌కు బెస్ట్ విషెస్‌.. కంగ్రాచ్యులేష‌న్స్ అండ్ గుడ్ ల‌క్.‌ అని ఆయ‌న ట్వీట్ చేశారు.

పోస్ట‌ర్‌లో మ‌ధునంద‌న్ గుబురుగా పెంచిన గ‌డ్డంతో సిగ‌రెట్ తాగుతూ ఇంటెన్స్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. మ‌రో స్టిల్‌లో స్టాండ్ వేసిన బైక్‌కు ఆనుకొని నిల్చొని ఎవ‌రి కోస‌మో వెయిట్ చేస్తున్నాడు. టైటిల్‌, పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణ‌న్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన 'గుండె క‌థ వింటారా' చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మ‌సాలా కాఫీ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, కృష్ణ‌చైత‌న్య పాట‌లు రాస్తున్నారు.

ర‌వివ‌ర్మ‌న్ నీలిమేఘం, సురేష్ భార్గ‌వ్ సినిమాటోగ్రాఫ‌ర్లుగా వ‌ర్క్ చేస్తుండ‌గా, సాయికిర‌ణ్ ముద్దం ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

తారాగ‌ణం: మ‌ధునంద‌న్, స్వాతిస్ట కృష్ణ‌న్‌, శ్రేయ న‌విలే

More News

రాజశేఖర్ హీరోయిన్‌గా ‘జార్జిరెడ్డి’ బ్యూటీ

‘జార్జిరెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ముస్కాన్ ఖుబ్చందాని.

కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న మంత్రి గారి రాసలీలలు..

ఓ మంత్రిగారి రాసలీలలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ రక్షించాల్సిన మంత్రే భక్షించాలని చూసిన వైనం కర్ణాటకలో

అక్కడ మాత్రం ఇంకా థియేటర్లకు గడ్డుకాలమే..

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రజల జీవనస్థితిగతులు తలకిందులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్లకు గడ్డుకాలం దాపురించింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఓవర్‌ సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సమస్య?

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’.

ఇక అవినీతికి టీకాలు వేసేందుకు సిద్ధమవ్వండి: కమల్ హాసన్

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.