యాదాద్రిలో కన్నుల పండుగగా మహా కుంభ సంప్రోక్షణ... కేసీఆర్ ప్రత్యేక పూజలు

  • IndiaGlitz, [Monday,March 28 2022]

యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ ఘనంగా జరుగుతోంది. దీనిలో భాగంగా కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కన్నుల పండుగగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశి సందర్భంగా 11.55 గంటలకు ఈ మహోత్సవం జరుపుతున్నారు. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. అలాగే 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిపారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మిగిలిన ఆలయ గోపురాలకు శాసనసభ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నిమిషాల నుంచి గర్భాలయంలోని మూలవరుల దర్శనానికి అనుమతించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ దంపతులు స్వామివారికి తొలిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన, సీఎం సహా ప్రముఖుల రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి ఆదివారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రూట్‌మ్యాప్‌ రూపొందించారు. ప్రత్యేకంగా పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ కింద నుంచి పైకి రవాణా సౌలభ్యం కోసం ఆర్టీసీ అధికారులు ‘యాదాద్రి దర్శిని’ బస్సులను ఏర్పాటు చేసింది.

ఇక ఆలయం విషయానికి వస్తే..

ఇక్కడి పంచనార సింహుల క్షేత్రం ఒకప్పటిలా గుహాలయం మాత్రమే కాదు.. ఇప్పుడది దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణ శిలలతో నిర్మితమైన ఆలయం. రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో.. ఇద్దరు స్థపతులు, 12 మంది ఉపస్థపతులు, 800 మంది శిల్పులు.. 1500 మంది కార్మికులు.. 66 నెలల పాటు శ్రమించి అద్భతాన్ని ఆవిష్కరించారు.

More News

భారతీయ మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో బిగ్ డీల్.. పీవీఆర్‌లో విలీనం కానున్న ఐనాక్స్

భారతదేశంలోని మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో దిగ్గజాలుగా పేరొందిన పీవీఆర్, ఐనాక్స్ ఒక్కటి కాబోతున్నాయి.

అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌ కార్లకు బ్లాక్ ఫిల్మ్ .. చలానా వేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

కేంద్ర మోటార్‌ వెహికిల్‌ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.

ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు థ్యాంక్స్.. చరణ్‌కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు .

అతడే నా గౌరవం.. చరణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి, ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు ఆయనకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి.

మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ పథకం పొడిగింపు, ఎన్ని నెలలంటే

కరోనా కారణంగా మనదేశంలో ఎలాంటి పరిస్దితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.