ఉత్తమ చలన చిత్రంగా ‘మహానటి’

  • IndiaGlitz, [Friday,August 09 2019]

ఢిల్లీలో 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించడం జరిగింది. కాగా తెలుగు చిత్రాలు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ‘మహానటి’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించిన కీర్తి సురేష్‌ ఉత్తమ నటిగా జ్యురీ సభ్యులు ఎంపిక చేశారు. కాగా.. మహానటికి ఒకటే కాదు.. మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం సంతోషించగదగ్గ విషయమే.

అంటే జాతీయ పురస్కారాల్లో తెలుగుతేజం మెరిసిందని చెప్పుకోవచ్చు. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ జాతీయ నటి, ఉత్తమ కాస్టూమ్స్ విభాగాల్లో (ఇంద్రాక్షి పాఠక్, గౌరంగ్ షా, అర్చనారావు) పురస్కారాలు ‘మహానటి’కి దక్కాయి. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రమే ఈ ‘మహానటి’. ఇప్పటికే ఈ చిత్రం పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకోగా.. తాజాగా జాతీయ స్థాయి పురస్కాలు దక్కించుకుంది.

తెలుగులో ఎంపికైన మరికొన్న చిత్రాలు, నటులు:

ఉత్తమ ఆడియోగ్రఫీ : రంగస్థలం (రాజాకృష్ణన్)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : చి.ల.సౌ (తెలుగు)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ‘అ!’ (తెలుగు), కేజీఎఫ్ (కన్నడ)
బెస్ట్ యాక్షన్ చిత్రం : ‘కేజీఎఫ్’
ఉత్తమ మేకప్ నటుడు : రంజిత్

మిగతా సినిమాల విషయానికొస్తే...

జాతీయ ఉత్తమ హిందీ చిత్రం : ‘అంధాధున్’
ఉత్తమ మరాఠీ చిత్రం : ‘భోంగా’
ఉత్తమ తమిళ చిత్రం : ‘బారమ్’
ఉత్తమ ఉర్దూ చిత్రం : ‘హమీద్’
ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా బన్సాలి (పద్మావత్ )
ఉత్తమ సినిటోగ్రఫీ చిత్రం: ‘పద్మావత్’
బెస్ట్ ఫ్రెండ్లీ స్టేట్ : ఉత్తరాఖాండ్‌

కాగా.. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు.