close
Choose your channels

మే 9న విడుదల కాబోతున్న 'మహానటి'

Sunday, March 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `మ‌హాన‌టి`. వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక ద‌త్ నిర్మాత‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు విడుద‌ల తేదీ ఖరారు చేసుకుంది.

ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్ర విడుద‌ల తేదీని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న‌ట్టు నిర్మాత తెలిపారు. 1990 మే 9న‌... వైజ‌యంతీ మూవీస్ సంస్థ నుంచి వ‌చ్చిన `జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి` టాలీవుడ్ రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ కొత్త చ‌రిత్ర సృష్టించింది. స‌రిగ్గా అదే రోజున `మ‌హాన‌టి` విడుద‌ల అవుతుండ‌డం విశేషం. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇది వ‌ర‌కు చూడ‌ని వినోదాన్ని పంచివ్వ‌బోతోంది. మ‌హాన‌టి సావిత్రి క‌థ‌ని వెండి తెర‌పై ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించిన తీరు.. తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చిరస్థాయిగా చిలిచిపోయేలా ఉంటుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.