close
Choose your channels

'మ‌హాన‌టి' విడుద‌ల అప్పుడేనా?

Monday, March 12, 2018 • తెలుగు Comments

న‌టీమ‌ణి సావిత్రి జీవిత కథ ఆధారంగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'మహానటి' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వైజయంతి మూవీస్ సంస్థ‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి.. ఇటీవల జెమినీ గణేశ‌న్ పాత్రధారి దుల్కర్ సల్మాన్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

సావిత్రి బయోపిక్ అంటే.. జమున, భానుమతి, ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాల ప్రస్తావన కూడా తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే ఈ పాత్రలకు నటీనటుల ఎంపిక పూర్తవగా.. ఏఎన్నార్ పాత్రకు నాగ చైతన్యను పేరును పరిశీలిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ పాత్ర కోసం ఆయన మనవడు ఎన్టీఆర్ (తారక్)ను సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో ఇప్పుడు ఈ పాత్రలో కనిపించే నటుడి కోసం అన్వేషిస్తోంది చిత్ర యూనిట్.

దీంతో పాటు ఇంకా చాలా పని మిగిలి ఉండడంతో.. ఈ మూవీ సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంద‌ని తెలిసింది. మార్చి 29న విడుద‌ల కావాల్సిన ఈ సినిమాని జూన్ లేదా జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.