గండిపేటలో 'మహానటి' సెకండ్ షెడ్యూల్

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి" షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. "ఎవడే సుబ్రహ్మణ్యం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ గండిపేటలో జరుగుతోంది. కీర్తి సురేష్-దుల్కర్ సల్మాన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ లాంగ్ షెడ్యూల్ లో మరింతమంది కీలకపాత్రధారులు కూడా పాల్గొననున్నారు.
మిగతా పాత్రధారులు మరియు టెక్నీషియన్ల వివరాలు అతి త్వరలో వెల్లడిచేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు!

More News

రూమర్స్ కు చెక్ పెట్టిన అనసూయ

బుల్లితెరపై బజర్దస్త్ ప్రోగ్రామ్తో మంచి జనాదరణ పొందిన అనసూయ ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది. ఈరోజు సోషల్ మీడియాలో అనసూయపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

తలైవా పుట్టినరోజున

సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న విజువల్ వండర్ '2.0'. ఈ హిట్ కాంబినేషన్లో రూపొందిన 'రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా నటిస్తున్నాడు.

డీజే బెనిఫిట్ షోస్ లేవు...

స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్'. దిల్రాజు తన బ్యానర్లో నిర్మిస్తున్న 25వ చిత్రమిది.

ఈసారి చైతుతో

మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయిక' సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.

'కాలా' సెట్ లో విషాదం...

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కాలా'.ప్రస్తుతం సినిమా చెన్నై షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.