ఏప్రిల్ 14న 'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Friday,April 13 2018]

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'మ‌హాన‌టి'.  వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక ద‌త్ నిర్మాత‌.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్ర బృందం రేపు (ఏప్రిల్ 14) 'మహానటి' మోషన్ పోస్టర్ తోపాటు సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన సమంత, విజయ్ దేవరకొండల ఫస్ట్ లుక్స్ మరియు మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ బయోపిక్ గా తెరకెక్కుతున్న 'మహానటి' సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్ర రాజం. దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

దుల్కర్ సల్మాన్, శాలిని పాండే, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న 'మహానటి' చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వనుంది.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, కళా నేతృత్వం: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్ 

More News

శ్రీరెడ్డి పై 'మా' నిషేధం ఎత్తివేత‌... లైంగిక వేధింపుల‌పై క్యాష్ క‌మిటీ!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఫిలిం ఛాంబ‌ర్, డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, `మా`

విష్ణుకి ఈ సారి కూడా క‌లిసొస్తుందా?

క‌థానాయ‌కుడిగా మంచు విష్ణు కెరీర్ మొద‌లై 15 ఏళ్ళు పూర్త‌వుతోంది.

నెల‌కో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్‌..

తొలి చిత్రంతో సినీ పరిశ్రమలో విజయం అందుకోవడం దర్శకులకి ఎంత ముఖ్యమో..

పూరీ.. ప‌దేళ్ళ త‌రువాత‌

పూరీ జగ‌న్నాథ్‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని ద‌ర్శ‌కుడి పేరిది. ఎన్నో సంచ‌ల‌న విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ ద‌ర్శ‌కుడు..

నాగార్జున సూపర్ మాస్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న నాగచైతన్య

నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన "అల్లరి అల్లుడు" చిత్రంలోని "నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు" అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.