బాలీవుడ్‌కి 'మ‌హాన‌టి'

  • IndiaGlitz, [Wednesday,May 16 2018]

కీర్తిసురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'మ‌హాన‌టి'. సావిత్రి జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళంలో విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్‌తో ర‌న్ అవుతోంది. సినిమా గురించి అంద‌రూ పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. ఈ సినిమా గురించి విన్న బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా సినిమాను చూశారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకోవ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారని స‌మ‌చారం. మ‌రి మ‌హాన‌టిని హిందీలోకి అనువాదం చేస్తారో లేక రీమేక్ చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.