'మహానుభావుడు' కి ఆ పాటే హైలెట్ అట

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'మ‌హానుభావుడు'. ద‌స‌రా కానుక‌గా రానున్న ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. ఈ రోజే విడుద‌ల చేసిన టైటిల్ ట్రాక్‌కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. పాట బాగుందంటూ ట్వీట్ చేసిన అభిమానుల కాంప్లిమెంట్స్‌ని రీట్వీట్ చేయ‌డంలో ఉద‌యం నుంచి థ‌మ‌న్ బిజీ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. 'మ‌హానుభావుడు' పాట‌ల‌న్నీ విన్నాన‌ని, అయితే పాట‌ల‌న్నింటిలోకి టైటిల్ సాంగే హైలెట్ గా ఉంద‌ని ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు బివీఎస్ ర‌వి ట్విట్ట‌ర్‌లో చెప్పుకొచ్చాడు. గ‌తంలో గోపీచంద్‌తో 'వాంటెడ్' చిత్రాన్ని రూపొందించిన ర‌వి.. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్‌తో 'జ‌వాన్' తెర‌కెక్కిస్తున్నాడు. ఆ చిత్రానికి సంగీత‌మందిస్తున్న థ‌మ‌న్‌, అందులోని హీరోయిన్ మెహ‌రీన్ 'మ‌హానుభావుడు' టీమ్‌లోనూ ఉన్నారు. అందుకే థ‌మ‌న్‌తో ఉన్న చ‌నువుకొద్ది ఆ పాట‌లు త‌ను ముందే వినేశాడ‌న్న‌మాట‌. మ‌రి ర‌వి చెప్పినట్లుగానే టైటిల్ సాంగే హైలెట్ అవుతుందో లేదో తెలియాలంటే మ‌నం కూడా ఫుల్ ఆల్బ‌మ్ వినాల్సిందే. అందుకు ఇంకా కొంచెం టైం పడుతుందిలెండి.

More News

ఏడేళ్ల త‌రువాత‌..

సందీప్ చౌతా.. ఈ పేరు విన‌గానే 'నిన్నే పెళ్లాడుతా', 'ప్రేమ‌క‌థ‌', 'సూప‌ర్‌', 'బుజ్జిగాడు' లాంటి మ్యూజిక‌ల్ హిట్స్ గుర్తుకువ‌స్తాయి. ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు చేసిన‌ప్ప‌టికీ గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన సందీప్‌.. తెలుగులో చివ‌రిగా చేసిన చిత్రం 'కేడి'.

విజ‌య్ ఆంటోనితో అంజ‌లి

తెలుగమ్మాయి అంజ‌లి.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'అంగాడి తెరు' (షాపింగ్ మాల్‌), 'ఎంగేయుం ఎప్పోదుం' 'జ‌ర్నీ), 'ఇరైవి' త‌దిత‌ర త‌మిళ‌ చిత్రాల‌తో అంజ‌లి మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది.

నివేదా.. ట్రాక్ మారుస్తోందా?

'జెంటిల్ మన్','నిన్నుకోరి'చిత్రాలతో తెలుగువారిని ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్.

'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' పాటల విడుదల

ధర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరుతో కలిసి స్వీయ దర్శకత్వంలో

దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా B.tech బాబులు ప్రచార చిత్రం విడుదల

JP క్రియేషన్స్ బ్యానర్ లో ధన జమ్ము నిర్మాతగా శ్రీను ఇమంది దర్శకత్వంలో