'మహర్షి' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ డేట్‌

  • IndiaGlitz, [Monday,April 22 2019]

సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'మహర్షి'. దిల్‌రాజు, అశ్వినీదత్‌, పివిపి నిర్మాత‌లు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో మే 1న నిర్వహించబోతున్నారట. ఈవారంలోనే వేదిక, ఫంక్షన్‌కు సంబంధించిన ఇతర వివరాలను ఫిక్స్‌ చేయబోతున్నారట. 'మహర్షి' మహేష్‌ 25వ సినిమా కావడంతో ఆయనతో పనిచేసిన దర్శకులు .. ఆయన గురించి చెప్పిన విషయాలను ఓ వీడియో రూపంలో కూడా ఈ ఫంక్షన్‌లో ప్రదర్శిస్తారట.

More News

పారిస్‌లో మహేష్ ఫ్యామిలీ టైం

సూపర్‌స్టార్‌ మహేష్‌ నిన్నటి వరకు తన సినిమా మహర్షి చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ అంతా పూర్తయ్యింది.

చైతన్యతో శ్రద్ధా శ్రీనాథ్‌

కన్నడలో 'యూ టర్న్‌' సినిమా సక్సెస్‌ సాధించడంతో శ్రద్ధా శ్రీనాథ్‌ ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

అఖిల్‌తో ర‌ష్మిక‌

అక్కినేని అఖిల్‌ హీరోగా నాలుగో చిత్రం త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. గీతాఆర్ట్స్‌ సినిమాను నిర్మించనుంది.

దిల్‌రాజు, దశరథ్‌ నేరస్థులా? 

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గురించి సినిమా పరిశ్రమలో తెలియని వారుండరు. దశరథ్‌తో కలిసి ఈయన ప్రభాస్‌ హీరోగా 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

కథా చౌర్యం జరిగిందా? 

తమిళ స్టార్‌ హీరోల్లో ఒకరైన విజయ్‌ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను దర్శకుడు అట్లీ చోరీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.