'మ‌హ‌ర్షి' చిత్రీక‌ర‌ణ పూర్తి

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అశ్వినీద‌త్‌, పివిపి నిర్మిస్తోన్న ఈ చిత్రం మే 9న సినిమా విడుద‌ల‌కానుంది. మ‌రో ప‌క్క పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. నిన్న‌టితో ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా పూర్త‌య్యింది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో సినిమా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌య్యింద‌ని తెలిపారు

మ‌హేష్ అభిమానులు, ప్రేక్ష‌కులు 'మ‌హ‌ర్షి' సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ఫోటోలు, సాంగ్స్ సినిమాపై అంచనాల‌ను పెంచాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ‌ట్టిగానే జ‌రిగింది. మ‌రి మే 9న రిషిగా మ‌హేష్ ఎన్ని రికార్డుల‌కు స్వాగ‌తం చెబుతారో చూద్దాం.