స్టైలిష్ పోలీస్ గా మహేష్...

  • IndiaGlitz, [Sunday,September 11 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ రా ఏజెంట్‌గా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మ‌హేష్ పాత్ర గురించి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో సినిమా సంగీత ద‌ర్శ‌కుడు హారీష్ జైరాజ్ రివీల్ చేసేశాడ‌ట‌. మ‌హేష్ స్టైలిష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తాడ‌ని హారీష్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను వ‌చ్చే వేస‌విలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. సినిమా బ‌డ్జెట్ వంద‌కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని ఫిలింన‌గ‌ర్ స‌మాచారం.

More News

'హైపర్‌' షూటింగ్ పూర్తి

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

'ఇంకొక్క‌డు' విజ‌య‌యాత్ర‌

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. ఆనంద‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ బ్యాన‌ర్‌పై నీలం కృష్ణారెడ్డి విడుద‌ల చేశారు.

వెంకటరమణ కుటుంబానికి 5 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన పవన్..!

కాకినాడలో జరిగిన జనసేన సభలో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎన్.వెంకటరమణ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల

వెంకీ స‌ర‌స‌న నితిన్ హీరోయిన్..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాబు బంగారం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ మూవీ సాలా ఖ‌దూస్ తెలుగు రీమేక్లో న‌టించ‌నున్నాడు.

సోనూసూద్ కోసం షారుఖ్ ఖాన్..!

తమన్నా,ప్రభుదేవా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో విజయ్ తెరకెక్కించిన చిత్రం అభినేత్రి.