close
Choose your channels

రీల్‌‌లోనే కాదు.. రియల్‌ ‌లైఫ్‌‌లోనూ మహేశ్ హీరోనే!

Sunday, February 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీల్‌‌లోనే కాదు.. రియల్‌ ‌లైఫ్‌‌లోనూ మహేశ్ హీరోనే!

టాలీవుడ్ సూపర్‌‌స్టార్ మహేశ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. రీల్‌‌లోగానీ.. రియల్ లైఫ్‌‌లోగానీ ఆయన ఏది చేసినా నయా ట్రెండే. అప్పట్లో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన మహేశ్ రియల్ లైఫ్‌‌లో శ్రీమంతుడిగా మారిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మహేశ్ చేసిన మంచి పనులు చాలానే ఉన్నాయి. కాగా.. నేడు మహేష్- నమ్రతల 14వ పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఈ వేడుకను సింపుల్‌‌గా ముగించేశారు.

ఈ సందర్భంగా మహేష్ నమ్రత దంపతులు హైదరాబాద్‌‌లోని బేగంపేటలో ఉన్న దేవనార్ స్కూల్ ఆఫ్ బ్లైండ్ విద్యార్థులకు విందు ఏర్పాటు చేసింది. 650 మంది అంధ బాలలు ఈ విందులో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో, తమ వంతు సహాయంగా విరాళాలు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుడే మహేష్ - నమ్రత దంపతులు ఈ సందర్భంగా తమ ఆనందాన్ని పిల్లలతో పంచుకున్నారు. మంచి మనసున్న మహేష్ - నమ్రత దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్తు మరింత ఆనందమయం అవ్వాలని అంధబాలలు, దేవనార్ స్కూల్ యాజమాన్యం ఆ భగవంతుడ్ని కోరుకున్నారు. కాగా ఈ ఫోటోలను నెట్టింట్లో చూసిన మహేశ్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటూ.. శభాష్ అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.