మ‌హేష్‌.. ఐదేళ్ళ త‌రువాత

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి. క‌థానాయ‌కుడిగా త‌న 19 ఏళ్ళ కెరీర్‌లో.. 2000, 2002, 2003, 2004, 2006, 2014.. ఇలా ఆరు సార్లు మాత్ర‌మే ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో ఆయ‌న అభిమానుల ముందుకొచ్చారు.

గ‌త మూడేళ్ళుగా ఏడాదికో సినిమాతో ప‌ల‌క‌రించిన మ‌హేష్‌.. ఈ ఏడాది కూడా భ‌ర‌త్ అనే నేనుతో స‌రిపెట్టుకుంటున్నారు. అయితే వ‌చ్చే ఏడాది మాత్రం రెండు సినిమాల‌తో అభిమానుల ముందుకు రానున్నారు మ‌హేష్‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న త‌న త‌దుప‌రి చిత్రం ఈ జూన్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్ళ‌నుండ‌గా.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో తెర‌పైకి రానుంది.

ఇక సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న చిత్రం ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళి.. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మొత్త‌మ్మీద‌.. 5 ఏళ్ళ త‌రువాత మ‌హేష్ డబుల్ ధ‌మాకా ఇచ్చేందుకు సిద్ధ‌మవుతున్నార‌న్న‌మాట‌.

More News

బాల‌య్య సినిమాకు పోటీగా..

నంద‌మూరి బాల‌కృష్ణకు క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో బోయ‌పాటి శ్రీ‌నుకి ప్ర‌త్యేక స్థాన‌ముంది. బాల‌య్య‌కు వరుస ప‌రాజ‌యాలు ఉన్న స‌మ‌యంలో.. సింహా, లెజెండ్ వంటి సినిమాల‌ను అందించి..

ఆ ఇద్ద‌రు మిస్స‌యినా.. కొర‌టాల మిస్ కాలేదు

ఇటీవ‌ల కాలంలో తొలి చిత్రంతో విజ‌యం సాధించిన ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు..

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'

ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు.

దేవిశ్రీ ఖాతాలో మ‌రొక‌రు..

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్నారు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌.

బాల‌కృష్ణ‌తో మ‌ళ్ళీ అలాగే..

నటసింహా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో మ‌రో విజ‌యవంత‌మైన చిత్రంగా నిలిచింది..